ఒక పార్టీ విధానాలు నచ్చక, వేరే పార్టీలో చేరటం, మనం చూసే రాజకీయాల్లో సర్వ సాధారణం. ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వాళ్ళే, పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న రోజులు ఇవి. రాజీనామా చేయకుండా వస్తే కుదరదు అని చెప్పిన వాళ్ళే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. అయితే పదవుల్లో లేని వాళ్ళు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక వేరే పార్టీలో చేరటం సర్వ సాధారణం. అయితే మన రాష్ట్రంలో దానికి కూడా అవకాసం లేనట్టు ఉంది. మా పార్టీని కాదని వేరే పార్టీలోకి వెళ్తావా అంటూ, ఆ నాయకుడుని కిడ్నాప్ చేసిన షాకింగ్ ఘటన, ఇప్పుడు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా కిడ్నాప్ లు చేయటం, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సమయంలో చూసాం. అయితే ఇప్పుడు వెరైటీగా, పార్టీ మారతాను అంటే కిడ్నాప్ చేసేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఆయన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని చండ్రాజుపాలెంకు చెందిన, వైసీపీ మండల స్థాయి నాయకుడు. ఆయన పేరు గాదె వెంకటరెడ్డి. వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన నాయకుడు. మొన్న ఆరు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల నామినేషన్ లో కూడా, బెల్లంకొండ జడ్పీటీసీ అభ్యర్ధిగా వైసీపీ తరుపున నామినేషన్ వేసారు. మొన్నటి దాకా వైసిపీ గెలుపు కోసం అన్ని విధాలుగా పని చేసారు. అయితే ఎందుకో కానీ ఆయనకు పార్టీకి గ్యాప్ వచ్చింది.

tdp 1112020 2

ఆయన్ను పార్టీ పట్టించుకోవటం మానేసింది. కొద్ది రోజులు క్రితం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిన సమావేశానికి వెళ్ళినా, అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కావాలనే తనను పక్కన పెడుతున్నారని, ఇది అవమానంగా భావించి, పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక తెలుగుదేశం నేతలతో మాట్లాడారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ హైదరాబాద్ లో ఉండటంతో, వారి సమక్షంలో పార్టీలో చేరాలని, తన అనుచరులతో కలిసి బయలు దేరారు. అయితే ముందుగా ఆయన నలుగురుతో కలిసి కార్ లో హైదరాబాద్ బయలు దేరి వెళ్ళగా, కొద్ది సేపటి తరువాత, ఒక వంద మంది అనుచరులు కూడా హైదరాబాద్ వెళ్లారు. అయితే, హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఆయన కారు ఆపిన కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు, కారు తాళాలు లాక్కుని, ఆయన్ను తీసుకుని వెళ్లారు. ఆయన ఆచూకీ కోసం వెతుకుతూ ఉండగా, తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయతే ఆయన తనని ఎవరూ కిడ్నాప్ చేసినట్టు చెప్పలేదు. అయితే ఇదంతా వైసీపీ చేసిన పని అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చివరకు పార్టీ మారతాం అంటే కూడా, ఇలా వేదిస్తారా అంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. అయితే ఇది కిడ్నాప్ ఆ, లేదా బెదిరించారా అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read