తెలుగుదేశం పార్టీ దూకుడు కార్యక్రమాలతో వైసీపీ గందరగోళంలో పడిందనే వారి వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం అవుతోంది. మరోవైపు వైసీపీకి కోర్టుల్లోనా, కేంద్రం నుంచి వరస దెబ్బలతో అల్లాడిపోతోంది. మరోవైపు పార్టీలోనూ తిరుగుబాటు స్వరాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టిడిపి చేసే విమర్శలు, ఆరోపణలకి సమాధానం ఇచ్చే దమ్ములేక ఏడుపుగొట్టు సవాళ్లతో ముందుకొస్తున్నారు. అనపర్తి సభలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గ్రావెల్ దోపిడీపై ఆరోపణలు గుప్పించారు. దీనిపై మాట్లాడటానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే తనకు గ్రావెల్ మాఫియాతో సంబంధంలేదని చెప్పాలి. దమ్ముంటే విచారణ చేయాలని చెప్పాలి. విచిత్రంగా చంద్రబాబుకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. టిడిపి నుంచి గెలిచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తనపై చంద్రబాబు పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. టిడిపి చేసే ఆరోపణలపై సమాధానం చెప్పే దమ్ములేక ఇలా తమపై పోటీ చేయాలని ఏడుపుగొట్టు చాలెంజులు విసరుతున్నారని రాజకీయ విశ్లేషకుల మాట. ఏడుసార్లు వరసగా కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబుని కుప్పంలోనే ఓడిస్తామని వైసీపీ అధినేత జగన్ చెబుతుంటే, వీళ్లేమో వారి నియోజకవర్గాలకి వచ్చి చంద్రబాబు పోటీచేయాలని అడుగుతున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు టిడిపి దూకుడుతో వైసీపీ నేతలకి మైండ్ పోయిందని అంటున్నారు.
టిడిపి దూకుడుతో వైసీపీ నేతలకి మైండ్ పోయిందా?
Advertisements