ఎన్నికల సమయం ఆసన్న మవుతుండటంతో వైసీపీలో ప్రశాంత్‌కిషోర్ బృందం హల్చల్ మొదలైంది. నేతల మధ్య వివాదాలు నెలకొన్న నియోజకవర్గాలపై వారు ప్రత్యక్ష జోక్యం చేసుకొని రాజీ చర్చలు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలోని కొండపి, మార్కా పురంపై వారు ప్రస్తుతం దృష్టిసారించి శుక్రవారం కొండపి నేతలతో మంతనాలు జరిపారు. ఇటు అశోక్‌కుమార్, అటు వెంకయ్యలకు ఒకరికి కొండపి, మరొకరికి సంతనూతల పాడు అన్నట్లు చర్చలు జరిపినట్లు తెలిసింది. మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె, మాజీ ఎ మ్మెల్యే కె.పి.కొండారెడ్డిని కలిసి రావాలని సూచించగా వారు విడివిడిగా చర్చలకు సిద్ధమైన ట్లు సమాచారం. మరోవైపు ఆ పార్టీలో చే రేందుకు సిద్ధమైన మాజీమంత్రి డాక్టర్ దగ్గు బాటి వెంకటేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే ఆమం చి కృష్ణమోహన్‌లు ఈనెల 27న అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
రాష్ట్రంలో పార్టీ ఎన్నికల వ్యూహం ఖరారుకు, ఎప్పటికప్పుడు సర్వేల నిర్వహణకు ఉత్తర భారతదేశానికి చెందిన ప్రశాంత్ కిషోర్ బృం దాన్ని వైసీపీ అధికారికంగా నియమించుకున్న విషయం విదితమే. ఇప్పటివరకూ అభ్యర్థుల్లో ఎవరు బలవంతులు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది అన్న అంశాలకు సం బంధించి సర్వేలు నిర్వహించిన ఆ బృందం తాజాగా వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో నాయకులతో చర్చలకు శ్రీకారం పలికింది. సహజంగా పార్టీ అధినేత జగన్ కానీ, ఆ త ర్వాత స్థానంలో ఉన్న నాయకులు కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం రివాజు. కానీ ఇక్కడ ఆ బాధ్యతను జగన్ పీకే బృందానికి అప్పగించినట్లు తెలిసింది. అందుకు అ నుగుణంగానే పీకే జిల్లాలోని ఆయా ని యోజకవర్గాల్లో నేతలతో చర్చలు ప్రారంభించారు.
అయితే జగన్ దేశంలో లేని సమయంలో, ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యుహకర్త వచ్చి, హంగామా చేయ్యతాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపొతున్నారు. అతను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు అని, జగన్ కూడా అతనికి అన్ని అధికారులు ఇచ్చారని వాపోతున్నారు. జగన్ ని అధినేతగా గౌరవిస్తామని, కాని ఇలాంటి వారు మా పై పెత్తనం చేస్తే ఎలా అని వాపోతున్నారు. అదీ జగన్ లేని టైంలో, నేతల మధ్య సయోధ్య కుదర్చటానికి, పీకే ఎవరు అంటూ మండిపడుతున్నారు. అయినా ఈ తతంగం మొత్తానికి జగన్ అనుమతి ఉండటంతో, ఎవరూ ఏమి అనలేక, మిన్నకుండి పోతున్నారు. లండన్ నుంచి ఈ నెల 25న జగన్ రానున్నారు. ఆ వెంటనే ఈ వివాదాస్పద నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపికపై పీకే ఇచ్చే సమాచారానికి అనుగుణంగా జగన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.