వైసీపీ నాయకుల పంచాయతీ ఏకంగా సచివాలాయానికి చేరింది. ప్రజల సమస్యలు తీర్చాల్సిన సచివాలయంలో, పార్టీ సెటిల్మేంట్ లు చేసుకుంటూ, అక్కడే కొట్టేసుకుంటున్న సంఘటనలు చూసి, అక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు ముక్కన వేలు వేసుకుంటున్నారు. ఆగష్టు 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఇప్పటికే గ్రామ వలంటీర్ల ఎంపిక పరీక్ష విధానం, ఇంటర్వ్యూ ద్వారా చేసారు. అయితే ఇదేదే పేరుకు పెట్టినా, మొత్తం వైసీపీ కార్యకర్తలతోనే నింపేసరనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల వైసిపీ నేతలు చెప్పిన వారికే గ్రామ వలంటీర్లగా ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. అయితే, ఇదే ఇప్పుడు వైసిపీ నాయకుల మధ్య కూడా చిచ్చు పెట్టింది.

secretariat 07082019 2

దీంతో గ్రామ వలంటీర్ల వివాదాలు ఇప్పుడ ఏకంగా సచివాలయంలోనే కొట్టుకునేలా చేసాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నియోజకవర్గం ఎర్రగొండపాలెంలోని త్రిపురాంతకం మండలంలోని ఒక గ్రామం నుంచి కొంత మంది వైసీపీ నాయుకులు నిన్న సచివాలయం వచ్చారు. గ్రామ వలంటీర్‌ల ఎంపిక విషయంలో వారి మధ్య మాట మాట పెరిగి, కొట్టుకునే దాకా వెళ్ళింది. వచ్చిన వారు రెండుగా విడిపోయి, బాహాబాహీకి దిగారు. గ్రామ వలంటీర్‌ పోస్టల విషయంలో, ఇద్దరి మధ్య సయోధ్య కుదరకు ఇరు వర్గాలు ఏకంగా సచివాల్యంలోనే గొడవకు దిగాయి. రోడ్డు మీద లాగా, సెంటర్ లో లాగా, అరుపులు, కేకలు, తోపులాటలతో సచివాలయం మారుమోగింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

secretariat 07082019 3

వారిని వారించి, బయటకు పంపించి వేయటంతో, వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే సందర్భంలో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వారిని కూడా భద్రతా సిబ్బింది బయటకు పంపించి వేయటంతో, ఎంతో దూరం నుంచి, పని మీద వచ్చిన వారు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వివాదం పై, విద్యాశాఖ మంత్రి మాత్రం ఏమి స్పందించలేదు. అయితే అక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు మాత్రం, ఇలా పార్టీ గొడవులు, సచివాయలం వరకు రావటం ఇదే మొదటి సారని అంటున్నారు. సహజంగా ఇలాంటివి పార్టీ కార్యాలయాల్లో చూసుకుంటారని, అలాంటిది ఈ సెట్టేల్మేంట్ లు సచివాలయంలో చెయ్యటం, మళ్ళీ బహిరంగంగా కొట్టుకోవటం ఏంటని వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read