చంద్రబాబు హయంలో సోలార్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి, రాయలసీమలో పెద్ద పెద్ద సోలార్ ప్లాంట్ లు పెట్టించారు. కర్నూల్ లో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్ పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నంచి ఈ సోలార్ ప్లాంట్ లు టార్గెట్ గా వెళ్తున్నారు. మొన్నటికి మొన్న కడపలో గుర్తు తెలియని వ్యక్తులు 1700 సోలార్ ప్యానెల్స్ ని పగలగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కంపెనీకి 3 కోట్లు నష్టం వచ్చి, ఇలా అయితే ఇక్కడ నుంచి కంపెనీ ఎత్తేస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న, కర్నూల్ జిల్లా మెగా అల్ట్రా సోలార్ పార్క్ లో కూడా ఇలాంటి బెదిరింపుల పర్వమే కొనసాగింది. అయితే ఇక్కడ మాత్రం, దాడి చేసింది అధికార వైసీపీ నేతలు కావటం గమనార్హం. ఇప్పటికే పెట్టుబడులు రాక ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి చర్యలతో, కష్టపడి గతంలో తెచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నిన్న జరిగిన సంఘటన చూస్తే, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఎవరికైనా ఇలాంటి చర్యలును ఖండిస్తారు. జగన్ మోహన్ రెడ్డి గారు, ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి.

నిన్న కర్నూల్ సోలార్ పార్క్ లో, వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. అక్కడ ఉన్న కాంట్రాక్టులు తమ పార్టీ వారికే ఇవ్వాలని సోలార్ పార్క్ కంపెనీ ప్రతినిధులతో గొడవకు దిగారు. కర్నూల్ జిల్లా, గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో 5 వేల ఎకరాల్లో నిర్మించిన సోలార్ పార్క్ లో, నాలుగు కంపెనీలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో ఒక కంపెనీ అయిన, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ ఏడు బ్లాక్‌లలో 350 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ లో ఉన్న సోలార్ ప్యానెల్స్ శుభ్రం చేసే కాంట్రాక్టు ఉంది. ఈ విషయం పై గొడవ జరిగింది. ఆ కాంట్రాక్టు మాకే ఇవ్వాలి అంటూ, తుపాకులతో వచ్చి కంపెనీ ప్రతినిధులను బెదిరించారు వైసీపీ నాయకులు శివానందరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, మంచాలకట్టకు చెందిన అనిల్‌ కుమార్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి. కంపెనీ ప్రతినిధులను తుపాలకులతో బెదిరించి, ఆ కాంట్రాక్టు మాకే కావాలని బెదిరించారు. ఈ విషయంతో అవాక్కయిన కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి పై కేసు నమోదు చేసి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read