దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.

ycp 24022019

శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 

ycp 24022019

ఇది ఇలా ఉంటే, జనసేన ప్రచార రథాలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఏటీ అగ్రహారంలో జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు. వైసీపీ నేతల ఆక్రోశంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రచారరథాలను అడ్డుకోవాలని చూస్తే వైసీపీ నేతల ప్రచారాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి తెలుసుకున్న లోకేష్, వైసీపీ దౌర్జన్యాలని ఎండగట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read