కెసిఆర్ - జగన్ ల స్నేహం ఇప్పటిది కాదు. 2014 ఎన్నికల ముందే, కెసిఆర్, జగన్ పై ప్రేమ కురిపించారు. జగన్ కు 100 సీట్లు వస్తాయి అని చెప్పారు. కట్ చేస్తే చంద్రబాబు సియం అయ్యారు. ఇక తరువాత నంద్యాల వంతు. నంద్యాల ఉప ఎన్నికల్లో, జగన్ దే విషయం అన్నారు. అదీ అయిపొయింది. నంద్యాల ఎన్నిక కోసం, కెసిఆర్ డబ్బులు కూడా పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇద్దరూ కలిసి ఇప్పటి నుంచే పని చేస్తున్నారు. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు, జగన కు తన వంతు ఆర్ధిక సహాయంతో పాటు, కుల సమీకరణాల్లో కూడా జగన్ సహాయం చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని సెప్టెంబర్ 2 న, కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ పనులు కూడా జగనే చూస్తున్నారని అని తెలుస్తుంది.
దీనికి బలం చేకూరుస్తూ, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పనులు పర్యవేక్షిస్తూ కనిపించారు. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి పరిశీలించారు. అయితే, మీడియాని చూసిన చెవిరెడ్డి అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చెయ్యగా, మీడియా వెంట పడటంతో, ఒక కధ అల్లారు. సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. అయితే, సభా స్థలిలో చెవిరెడ్డికి చెందిన టిప్పర్ వాహనాలు పని చేయడం గమనార్హం. కెసిఆర్ - జగన్ కలిసి పని చేస్తున్నారనటానికి ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలి..
తెలంగాణాలో, జగన్ పార్టీకి చెందిన, ముగ్గురు ఎమ్మల్యేలు, ఒక ఎంపీకి, భారీ కాంట్రాక్టులు ఉన్నాయి. మిషన్ భగీరథ పనులలో భాగంగా కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు వీరికి ఉన్నాయి. ఇది జగన్ - కెసిఆర్ అవగాహనలో భాగంగా, జగన్ ను ఆర్ధికంగా మరింత బలం చేకుర్చి, చంద్రబాబుని దెబ్బతియ్యటానికి కెసిఆర్ ఎప్పుడో వేసిన ప్లాన్ ఇది. నంద్యాల ఉప ఎన్నికలో కూడా, జగన్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు అంతా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో వచ్చిన కమీషనే అని, కెసిఆర్ కూడా డబ్బు పంపించనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం, జగన్ ఎదురు డబ్బులు పెట్టి, కెసిఆర్ కి తోడ్పాటు అందించాల్సిన పరిస్థితి. మళ్ళీ కెసిఆర్ వస్తేనే, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్లకి కాంట్రాక్టులు వచ్చేది. అందుకే, తెలంగాణాలో ఉన్న రెడ్డి సామాజికవర్గం కెసిఆర్ కి సుప్పొర్ చేసేలా, ఆర్ధికంగా కూడా కెసిఆర్ వైపు ఉండేలా, చెయ్యటానికి జగన్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా కాంగ్రెస్ లో ఉంది. వీళ్ళను కెసిఆర్ వైపు తిప్పటానికి, జగన్ మోహన్ రెడ్డి, ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో కనుకు కెసిఆర్ మళ్ళీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, కెసిఆర్ కూడా జగన్ వైపు ప్రచారం చేసి, ఆర్ధిక సహాయం చెయ్యాలనే ప్లాన్ లో, తతంగం మొత్తం నడుస్తుంది.