మాచర్ల నియోజకవర్గంలో సంచలనం రేపిన పాపిరెడ్డి హత్యకేసును పోలీసులు చేదించారు. పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో భాగస్వాములైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, హనిమిరెడ్డిలను అరెస్ట్‌ చేయాల్సి ఉందని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ చెప్పారు.

ఈ నెల 17వ తేదీన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో, టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపర్తి పాపిరెడ్డిని ఈనెల 17న వైసీపీకి చెందిన కొందరు కత్తులతోనూ, రాడ్లతోనూ తీవ్రంగా గాయపరిచి ఆయన మృతికి కారకులయ్యారు.

ఈనెల 17న సత్రం సెంటర్‌ వద్దకు టీ తాగేందుకు పాపిరెడ్డి రాగా పిన్నెల్లి హనిమిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రె డ్డి తదితరులు విచక్షణా రహితంగా దాడి చేశా రు. మెరుగైన చికిత్స కోసం పాపిరెడ్డిని నరసరావుపేటకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు.

నిందితుల్లో పది మంది వెల్దుర్తి మండలంలోని జెండాపెంట కృష్ణానది రేవు వద్ద ఉన్నారని సమాచారం ప్రకారం మంగళవారం వారిని అరెస్ట్‌ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read