నెల్లూరు జిల్లాలోని కావలిలో, తెలుగుదేశం వ్యవస్థాపకడు, మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని, తొలగించిన సంగతి తెలిసిందే. వైసిపీ నేతలు దగ్గర ఉండి, పోలీసులు చేత, ఈ విగ్రహాన్ని తొలగించారు. దీని పై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా, ఈ అంశం పై, చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. మరో పక్క, ఈ అంశం పై, కావాలిలో స్థానికులు, తెలుగుదేశం శ్రేణులు కలిసి, గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి, ఆందోళన విరమించవద్దు అని, ఎంత దూరం అయినా సరే, మళ్ళీ విగ్రహ ప్రతిష్ట జరిగే వరకు, ఆందోళన కొనసాగించాలని, పిలుపిచ్చారు. మరో పక్క స్థానికులు ఈ విషయంలో, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైనే ఆరోపణలు చేసారు. వివాదం రోజు రోజుకీ పెద్దది అవ్వటంతో, ఈ వివాదానికి ముగింపు పలకటమే మంచిందని వైసీపీ భావించింది.

కావాలి వైసీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసారు. ఈ రోజు మధ్యాన్నం, స్వయంగా ఆయనే బాలయ్యకు ఫోన్ చేసి, విగ్రహం ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అసలు జరిగింది ఏమిటి, స్థానికుల ఆగ్రహం దేనికి అనే అన్ని విషయాల పై బాలకృష్ణకు వివరించారు. ఎన్టీఆర్ విగ్రహం గుడికి ఎదురుగా ఉంది కాబట్టే తొలగించామని, మళ్ళీ మేమే ఆ విగ్రహాన్ని, మంచి స్థలంలో, ఎవరికీ ఇబ్బంది రాని చోట పెడతామాని, సహకరించాలని, బాలయ్యను కోరారు. తానూ కూడా ఎన్టీఆర్ అభినమనేనని, ఈ విషయం పై, సరైన నిర్ణయం తీసుకునే విధంగా, సహకరించాలని బాలయ్యను కోరారు. దీంతో బాలయ్య, స్థానిక నాయకత్వాన్ని అడిగి, చెప్తానని తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తానికి, గత వారం రోజులుగా ఉన్న వివాదం, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క విగ్రహం తొలగింపు సందర్భంగా, ఒక 80 ఏళ్ళ పెద్దావిడ, ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వటంతో, ఆమె పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read