ఏ శాఖ సమాచారమైనా ప్రభుత్వం నుంచి ప్రకటించేది సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డే. సీఎం ప్రతినిధిగా, మంత్రుల తరఫునా ఆయనే మీడియా ముందుకొస్తారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలకీ ఆయనే వివరణ ఇస్తారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రకటనలన్నీ చూసుకునేది సజ్జలే. ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి టోన్ డౌన్ అవుతూ వస్తోంది. మీడియా ముందుకు మళ్లీ నానీలను వదులుతున్నారు. మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత కూడా కొడాలి నాని, పేర్ని నానిలు ప్రత్యేక ప్రెస్మీట్లు పెడుతున్నారు. సబ్జెక్టుతో సంబంధంలేకుండా విపక్షాలని బూతులు తిట్టాలంటే కొడాలి నానీ మీడియా ముందుకు తీసుకొస్తోంది వైసీపీ. కాపులు, జనసేన గురించి విమర్శలు గుప్పించాలంటే పేర్ని నాని వస్తున్నారు. మంత్రులంతా ఆల్మోస్ట్ మ్యూట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రెడ్డి సామాజికవర్గ మంత్రులైతే నోరు మెదపడంలేదు. సీఎం జగన్ రెడ్డి కూడా సభలకు వెళ్లినప్పుడు ముసలి చంద్రబాబు, దుష్టచతుష్టయం, పేదలతో ప్రయాణం, పెత్తందారులతో యుద్ధం వంటి డైలాగులూ ఆపేశారు. గత కొద్దిరోజులుగా మంత్రి పదవులు లేకపోయినా వైసీపీ మీడియా-సోషల్ మీడియా నానీల బైట్లతోనే ఫీడ్ నడుపుతోంది.
వైసీపీలో రెడ్డి సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు పై ఎందుకు విమర్శలు చేయటం లేదు ? వ్యూహం మార్చారా ?
Advertisements