ఓటు దొంగల్ని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట ప్రారంభించారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి గల్లంతు చేయాంచాలనే ఉద్దేశంతో కొంతమంది మోసపూరితంగా ఆన్‌లైన్‌లో ఫామ్ 7 దరఖాస్తులు చేశారంటూ ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన పిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీలైనంత వేగంగా ఈ కేసుల దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం, దాదపుగా 10 మంది వైసీపీ ఎమ్మల్యేలు, వీటి వెనుక ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర పన్నడం వాస్తవమేనని ఆ పార్టీ నేతలు అన్నారు. ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులు పరిశీలిస్తే 2 లక్షల 81వేల అసలైన ఓట్లను తొలగించాలని ఫామ్ 7 దరఖాస్తులు రాగా అందులో 95 శాతం వైసీపీ పెట్టిన దరఖాస్తులే ఉన్నాయని చెబుతున్నారు.

ap police 07032019

బూత్‌స్థాయి నాయకుల పేరిట ఇతర రాష్ట్రాల నుంచి ఈ పిర్యాదులను ఆన్‌లైన్‌లో పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ సంబంధంలేని బూత్ స్థాయి నేతలు ఇప్పుడు పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇతరుల ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు చేయడంతోపాటు తమ సమయం వృధా చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ పోలీసులకు ఎన్నికల అధికారులు పిర్యాదు చేశారు. మోసపూరితంగా ఫారం-7 దరఖాస్తులు పెట్టిన ఘటనలపై బుధవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదు కాగా...అందులో 235 కేసుల్లో 2,300 మంది దరఖాస్తుదారులను పోలీసులు గుర్తించారు. మిగతా కేసుల్లో ఉన్నదెవరో తేల్చే పనిలో పోలీసులున్నారు. అనంతరం వారు దురుద్దేశపూరితంగానే కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తులు చేశారా? అనేది తేల్చనున్నారు. వీలైనంత వేగంగా ఈ కేసుల దర్యాప్తును కొలిక్కొ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ap police 07032019

తన ఓటు తొలగించాలని కోరుతూ ఓటరు స్వతహాగా గానీ లేదా ఎవరైనా గ్రామంలో మృతిచెందిన వారి ఓట్లు, ఒకే పేరుతో జాబితాలో రెండుసార్లున్న పేర్లు, స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లు తొలగించాలని కోరుతూ ఫారం-7 దరఖాస్తు చేయచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి...దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో గత పది రోజుల వ్యవధిలో 8.74 లక్షల ఫారం-7 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. ఒకేసారి ఇన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటాన్ని అనుమానించిన ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఇందులో కొందరిని విచారించినప్పుడు తాము గ్రామాల్లోనే నివాసముంటున్నమని, తమ ఓటరు తొలగించాలని కోరుతూ ఎప్పుడూ దరఖాస్తు చేయలేదని విచారణ అధికారులకు చెప్పారు. ఆయా గ్రామాల్లోని ఒకరో ఇద్దరో వ్యక్తులు వారి పేరిట ఈ నకిలీ దరఖాస్తులు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసుస్టేషన్లలో స్థానిక తహసీల్దార్లు ఫిర్యాదులు చేశారు. 2,300 మంది దరఖాస్తుదారులను గుర్తించిన పోలీసులు వీరందరికీ సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అందరినీ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకుంటారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read