Sidebar

13
Thu, Mar

అమరావతిలో రైతులు గత 45 రోజులుగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు కూడా వచ్చి, వారి బాధ ఆలకించలేదు. ఒక్క మంత్రి కాని, ఒక్క అధికారి కాని వచ్చి, వారిస్ సమస్యల గురించి వినలేదు. అలా రాక పోగా, వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అని, మంత్రులే అన్నారు. అమరావతి ప్రాంతాన్ని ఎడారి అన్నారు. అమరావతి మహిళలను కూకటపల్లి ఆంటీలు అన్నారు. ఇలా అనేక రకాలుగా హేళన చేసారు. అలాగే, పోలీసులను పెట్టి, ఇబ్బందులు పెట్టారు. ఎన్ని చేసినా, ఏమి చేసినా, రైతులు మాత్రం, శాంతియుతంగానే వారి ఆందోళనలు కొనసాగించారు. ఒక్క అసెంబ్లీ ముట్టడి తప్పితే, ఎక్కడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పిలుపు ఇవ్వలేదు. ఇన్ని చేసినా, ఎంత జరిగినా, ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. అయితే, వీరు మాత్రం గత 45 రోజులుగా, ఓపికగా, ఓర్పుగా, ప్రభుత్వం విన్నా, వినక పోయినా, వారికి ఉన్న హక్కులు ఉపయోగించుకుని, ఏ నాటికైనా, ఈ ప్రభుత్వం తమ గోడు వినకపోతుందా అనే ఆశతో ఉన్నారు.

lavu 31012020 2

అమరావతి రైతులు ఎంత మంచి వారు అంటే, ఒక పక్క వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు, మాట్లాడుతున్నా, వారి జీవితాలు తారు మారు చేసే నిర్ణయం తీసుకున్నా, తమ వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీ పై ఎలాంటి పరుష పద జాలం ఉపయోగించకుండా ఉన్నారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు, నరసరావుపేట వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వచ్చారు. వారికి మద్దతు పలికారు. ఇక్కడ భూములు ఇచ్చిన ఎవరికి అన్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వ కమిటీ వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు. రైతుల కష్టాలు మాకు తెలుసని అన్నారు. కమిటీ వచ్చినప్పుడు మీ అందరి అభిప్రాయాలు చెప్పండి, అంటూ అక్కడ రైతులను ఉద్దేశించి ఎంపీ వ్యాఖ్యానించారు.

lavu 310120203

కమిటీ వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పండి, మీరు దూరంగా ఉండవద్దు, రైతులు అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడ రైతులకు, ఎంపీ చెప్పారు. అయితే, అక్కడ రైతులు ఈ మాటలు అన్నీ విని, అమరావతి ని కొనసాగిస్తూ మాతో చర్చకు రండి అని వైసీపీ ఎంపీకి తేల్చి చెప్పారు. రాజధానికి అనుకూలమా కాదా ముందు చెప్పాలి అని మందడంలో వైసీపీ మాట్లాడుతుండగా రైతుల నినాదాలు చేసారు. ఆయన మాత్రం, ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది, ఆప్పుడు అభిప్రాయలు చెప్పండి, అని చెప్పారు. అయితే, ఇంత ఆందోళనలో, ఉండి కూడా, గత 45 రోజులుగా తమ వద్దకు ఎవరూ రాకపోయినా, వైసీపీ ఎంపీ తమ వద్దకు వచ్చినా, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడలేదు అంటే, అక్కడ ప్రజలు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read