కరోనా మహమ్మారి నుంచి మనలను కాపాడుతుంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఇతర పారామిలటరీ స్టాఫ్. అయితే ఇటీవల కాలంలో వీరి పై దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, ప్రధాని మోడీ, వీరి పది దాడులు చేస్తే ఊరుకోం అంటూ ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. అయితే, ఇప్పుడు స్వాయంగా జగన్ పార్టీకే చెందిన ఒక ఎంపీ చేసిన పనిని, బయట పెట్టింది ఒక జాతీయ ఛానల్. వైకాపా మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ టెనెంట్ మెడికార్ఫ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసారని, ఆ వివరాలు బయట పెట్టింది టైమ్స్ నౌ. “బాలశౌరికి చెందిన కినేటా టవర్స్ లోని తమ ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేస్తున్నందున, ఆయన అభ్యంతరం తెలుపుతూ ఖాళీ చేయాలంటున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నాం" అని మెడికార్ప్ సంస్థ వ్యాజ్యంలో పేర్కొంది. టెనెంట్ మెడికార్ప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హోంశాఖ తరఫు న్యాయవాది తెలిపారు.
బాలశౌరి లేదా ఇతరులు మెడికార్ప్ పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ లోని కినేటా టవలో పదేళ్లకు అద్దె ఒప్పందం ఉన్నా ల్యాబను ఖాళీ చేయాలని చెప్పడంతో పాటు వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి దౌర్జన్యంగా చారి మూసేయడాన్ని సవాలు చేస్తూ టెనెట్ మెడ్ కార్పొ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున డాక్టర్ టి. విజేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ల్యాబ్ కోసం 2017 నవంబరులో భవన యజమాని కినేటా టవర్స్ లిమిటెడ్ పదేళ్లకు అద్దె ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కరోనా పరీక్షలకు ఐసీఎంఆర్ గుర్తించిన ల్యాబ్లో తమదీ ఒకటన్నారు.
భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంతో పాటు ల్యాబ్లోకి వెళ్లకుండా ఎంపీ బాలశౌరి తన అనుచరులతో దారులు మూసివేశారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే యజమానిపై పోలీసులు ఎస్ఎఆర్ నమోదుచేశారని, అడ్డంకులు తొలగించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ల్యాబ్ నిర్వహణకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసారు. వైసీపీ చర్యలను ఖండించారు. కరోనా టెస్టింగ్ ల్యాబ్ పనులు చేసుకోనివ్వకుండా, వారిని బయటకు గెంటే విధంగా చెయ్యటాన్ని తప్పుబట్టారు. వారికి అండగా ఉండాల్సింది పోయి, ఇలాంటి పనులు చేస్తారా అని ఖండించారు.