అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ప్రపంచ బ్యాంకుకి ఈ-మెయిల్స్... రుణ మాఫీ చెయ్యద్దు అంటూ ఆర్బీఐ కి లెటర్స్... రాజధానికి సహకరించద్దు అంటూ సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్స్... ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు అంటూ కంపెనీలకు ఈ-మెయిల్స్... తాజాగా రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దు అంటూ వైసీపీ ఎంపీల చేత కేంద్రానికి ఫిర్యాదు... ఇవన్నీ చేస్తుంది మన ప్రతిపక్షం అంటే నమ్మగలరా ? ప్రజల తరుపున పోరాడాల్సింది పోయి, రాజకీయం చెయ్యటం కోసం, ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారు.... వీళ్ళ మాటలు ఎవరూ లెక్క చెయ్యరు, ఏది ఆగదు, కాని ఈ విషయాలు ప్రజలు అర్ధం చేసుకోవాలి....
ఉపాధి హామీ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి... దేశంలోకల్లా మన రాష్ట్రంలోనే ఎక్కువ పనులు జరుగుతున్నాయి.. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది... ఉపాధి హామీ పనుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ గా నిలవటం, ఇష్టం లేని వైఎస్ఆర్ పార్టీ, ఓర్వలేక వైసీపీ ఎంపీలు చేత కేంద్రానికి ఫిర్యాదు చేశారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మీడియాతో చెప్పారు... వైసీపీ ఎంపీల ఫిర్యాదుతో నరేగాకు చెందిన రూ.1100 కోట్ల నిధులు రాలేదని ఆయన చెప్పారు.
వైసీపీ ఎంపీల ఫిర్యాదుతో కూలీలకు రావాల్సిన సొమ్ము జాప్యం అవుతుంది, పేద కూలీలు ఇబ్బంది పడుతున్నారు... ఆ ఫిర్యాదులు తప్పు అని రాష్ట్రం, నిరూపించుకుని, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి, కేంద్రనికి నివేదించి, వీళ్ళు చేసిన కుట్రలు చెప్తే కాని, ఆ నిధులు రావు... ఇదంతా జాప్యం అవ్వటానికి, నిధులు రాకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఆ పేదల పొట్ట కొట్టి, రాజకీయం చెయ్యాలనేది వైసీపీ పన్నిన మరో కుట్ర, ఇది...