ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మంచి పనులు చేసుకున్నా ప్రచారం చేసుకోవటం చేతకాదు అనే అపవాద ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే జరిగే వాస్తవాలు తెలిసిందే... ఇక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అయితే సరే సరి... వారు ఎప్పుడూ కంప్లేట్ స్లీప్ మోడ్ లో ఉన్నారు. వారికి అసలు ఏదీ పట్టదు. అవతలి వారు అకారణంగా బురద జల్లుతున్నా మొత్తం తగలబడిన తరువాత తాపీగా వచ్చి, ఇది వాస్తవం అని చెస్తారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీ ఎలాగూ వారు చేసింది చెప్పుకోవటం లేదు మేమైనా వారు చేసిన మంచి చెప్తాం అనుకుంటారో ఏంటో, ప్రతి సారి వైసీపీ ఎంపీలు ఎంతో ఆశతో పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటం, ప్రతి సారీ కేంద్రం, లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పటం...

ycp mp 30122017 2

ఇలా ప్రతి సారి, రాష్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అని ప్రశ్నలు అడిగితే, అది బుమరాంగ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అనే వాదన బయటకు వస్తుంది. తాజాగా, మరో సారి ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకుని, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం వైసీపీ ఎంపీల ద్వారా, పార్లమెంట్ సాక్షిగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుంది అని ఆర్ధిక లోటు తగ్గిపోతుంది అని చెప్పెంది... 14వ ఆర్థిక సంఘం సూచించినట్లుగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. శుక్రవారం లోకసభలో వైకాపా సభ్యుడు వైవీసుబ్బారెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 3.94% మేర ఉన్న రాష్ట్ర ఆర్థిక లోటు 2017-18నాటి సవరించిన అంచనాల ప్రకారం 3%కి తగ్గినట్లు పేర్కొన్నారు.

ycp mp 30122017 3

ఇదే సమయంలో సొంత పన్ను ఆదాయం 5.67% నుంచి 7%కి పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదికి ఆంధ్రప్రదేశ్ కు రూ.4118 కోట్ల రెవిన్యూలోటు ఏర్పడినట్లు గుర్తించి ఇప్పటి వరకూ ప్రత్యేక సాయం కింద రూ.3980 కోట్ల అందించినట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా బదిలీ చేసిన ఆనంతరం ఏపీకి ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీ కోసం 2015-20 కాలానికి రూ.22,212 కోట్ల ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించిందన్నారు. అందులో ఇప్పటివరకూ రూ.14,862 కోట్లు ఇచ్చామన్నారు. 2015-16లో రూ.6609 కోట్లు, 2016-17లో రూ.4930 కోటు, 2017-18లో రూ.3323 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అలాగే ఇంకో ప్రశ్నలో ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయి అని అడిగి, అక్కడా అభాసు పాలయ్యారు.. మరో ప్రశ్నలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేంద్రాన్ని స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అడిగారా అని ప్రశ్న వేస్తే, ముఖ్యమంత్రి అడిగారని కేంద్రం సమాధానం చెప్పింది.. ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్పుకోవటంలో విఫలం అయితే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం వారి ప్రశ్నలతోనే, చంద్రబాబు పరిపాలన అద్భుతం అంటూ, సాక్ష్యాలతో సహా వారే స్వయంగా పార్లమెంట్ సాక్షిగా బయట పెడుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read