వారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అధికార పార్టీ ఎంపీలు. పార్లమెంట్ లో చాలా బలమైన పార్టీ. 22 ఎంపీలతో, నాలుగో అతి పెద్ద పార్టీ పార్లిమెంట్ లో. వీళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షము కాదు, కేంద్రంలో భాగస్వామ్యం కాదు. అంటే కేంద్రంలో విపక్షం అనే చెప్పాలి. బలమైన ప్రతిపక్షం అనే చెప్పాలి. అయితే వైసీపీ ఎంపీలు మాత్రం, ప్రజా సమస్యల పై మిగతా పక్షాలతో కలిసి ఆందోళన చెయ్యటం లేదు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత బలం ఉంది అంటే, దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా ఉండాలి. అయితే వైసీపీ అందుకు భిన్నం. మిత్రపక్షం కంటే ఎక్కువగా బీజేపీని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటుంది. ఈ రోజు పార్లమెంట్లో అన్ని విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, జీఎస్టీ బకాయలు విడుదల చెయ్యాలని ఆందోళన చేసాయి. పార్లమెంట్ బయట కూడా ప్రదర్సన చేసాయి. తెలంగాణాలోని టీఆర్ఎస్ కూడా ఆందోళన చేసింది. అయితే వైసీపీ కూడా ఆందోళన చేసింది. ఈ ఆందోళన చూసిన రాష్ట్ర ప్రజలు అవాక్కయ్యారు. ఇందుకేనా ఇంత మందిని గెలిపించుకుంది అని ముక్కన వేలు వేసుకున్నారు.
ఇంతకీ వాళ్ళు చేసిన ఆందోళన రాష్ట్ర సమస్యల పై కాదు. సొంత కక్ష పై, ద్వేషం పై. చంద్రబాబు పై సిబిఐ విచారణ వెయ్యాలని, ప్లే కార్డులు పట్టుకుని ఆందోళన చేసారు. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా ఆందోళన చెయ్యరు. ఎందుకంటే, అధికారంలో ఉన్న వాళ్ళు సిబిఐ కోరితే అడ్డు పడేది ఎవరు ? మొన్న అంతర్వేది కేసు సిబిఐకి వైసీపీ ప్రభుత్వమే ఇచ్చింది. అలా ఈ కేసు కూడా సిబిఐకి ఇచ్చేయవచ్చు కదా ? దానికి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆందోళన ఎందుకు ? అక్కడ ఆందోళన చెయ్యల్సింది మన హక్కుల పై, విభజన హామీల పై, మనకు రావాల్సిన బకయాల పై, స్పెషల్ స్టేటస్ పై, రైల్వే జోన్ పై, పోర్టు పై, స్టీల్ ఫ్యాక్టరీ పై, వెనుకబడిన జిల్లాల నిధుల పై, పోలవరం నిధుల పై, ఇలా అనేక సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్ ఉండగా, తమ చేతిలో ఉన్న పని, సిబిఐ ఎంక్వయిరీ వెయ్యండి అని కేంద్రానికి ఒక ఉత్తరం రాయకుండా, ఈ ఆందోళన ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పోనీ విపక్షాలు జీఎస్టీ పై చేసిన ఆందోళనలో పాల్గున్నారా అంటే అదీ లేదు. ఇది మన రాష్ట్రంలో 23 ఎంపీలు రాష్ట్రం కోసం కాకుండా, చంద్రబాబు పై ఎంక్వయిరీ వెయ్యాలని ఈ రోజు వేస్ట్ చేసేసారు.