చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములురెడ్డికి వైకాపా నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడితోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శుక్రవారం రాత్రి ముందస్తు సమాచారంతో దాడి చేసిన పోలీసులు మద్యం నిల్వలను కనుగొనగా అక్కడున్న కాపలా దారులు అక్కడి నుంచి జారుకున్నారు. 170 కేసులో 8170 బాటిళ్ల మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మామిడి తోట యజమానిపై కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రామిరెడ్డి ఎస్సై రవిప్రకాష్రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో గెలవటం కోసం, పార్టీలు తాపత్రయ పడటం చూసాం కాని, ఇలా ఏకంగా ఒక డంప్ పెట్టుకుని, అదీ సొంత పార్టీ నేత తోటలో పెట్టుకుని, బరి తెగింపు రాజకీయం చెయ్యటం చూస్తున్నాం. ఎలాగూ ప్రజలను పోజిటివ్ వేవ్ తో కొనలేమని, ఇలా నెగటివ్ పనులు చేసి ఆకట్టుకుంటున్నారు.