ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి అంటే, ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థ. దేశాలను కూడా శాసించ గల సత్తా ఉన్న సంస్థ. ఇలాంటి సంస్థ, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇచ్చింది అంటే, ఎంతో రీసెర్చ్ చేసి కాని, ఆహ్వానించవు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ఇప్పటికే ప్రకటించింది.
అయితే, దీని పై వైసీపీ స్పందన వింటే, మనకు మైండ్ పోతుంది... ఇదేదో సాక్షి టీవీ అనుకున్నారో ఏమో కాని, చంద్రబాబు ఐక్యరాజ్యసమితిని మ్యానేజ్ చేసారు అంటూ, నిస్సిగ్గుగా ప్రకటించింది. వీళ్ళ తెలివి ఇలా ఏడ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ, మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ప్రకృతి సేద్యానికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారట... ఈ విషయం మన రైతులు, ప్రజలకు తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రసంగించేందుకు ఆయనను ఆహ్వానించారట అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు అసలు వ్యవసాయ విషయంలో అంతర్జాతీయ గౌరవం పొందే అర్హత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం మరీ చోద్యం అన్నారు. 2024 నాటికి ఏపీలో 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట, ఈ విషయం మన రైతులకు, మన దేశంలోని వారికి తెలియదు కానీ, ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి వారికి ఏం చెప్పిందో కానీ ప్రకృతి వ్యవసాయానికి చంద్రబాబు ఏవో సేవలు చేస్తున్నారని భావించి ప్రసంగించాలని కోరారని విమర్శించారు. అయితే, వైసీపీ స్పందన చూస్తుంటే, వీళ్ళకు ఉన్న జ్ఞానం ఏపాటిదో అర్ధమవుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత అరుదైన గౌరవం ఇస్తుంటే, తట్టుకోలేక పోతున్నారు.