ఈ క్షణాన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యర్ధి చంద్రబాబు కంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పవన్ కనుక ఆక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తే, ముఖ్యమంత్రి సంగతి తరువాత, ముందు అసలు ప్రతిపక్ష హోదానే కష్టం అంటూ, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ తో జగన్ ఎప్పుడో అలెర్ట్ అయ్యారు... అందుకే పవన్ ఎప్పుడు ఏ సమస్య లేవనెత్తినా, పవన్ కళ్యాణ్ కి తోడూ ఉండాల్సింది పోయి, పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ సాక్షిలో కధనాలు వస్తూ, సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ తో, పవన్ ని ఘోరాతి ఘోరంగా తిట్టే కార్యక్రమం చేస్తున్నారు...
ఎక్కడైనా ప్రతిపక్షంగా ఉంటూ, ఒక పార్టీ ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరిస్తుంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీని సహకరించాల్సింది పోయి, పవన్ ని పర్సనల్ టార్గెట్ చెయ్యటం చూస్తుంటే, జగన్, పవన్ ని చూసి ఎంత భయపడుతున్నారు అర్ధమవుతుంది... అయితే తాజాగా, జనసేన మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చెయ్యటానికి సన్నాహకాలు చేస్తున్నారు... అయితే అక్కడ భూమి, మూడేళ్ళ పాటు లీజు పద్ధతిలో తీసుకున్నారు... ఈ విషయం, వైఎయస్ఆర్ పార్టీ, జగన్ సోషల్ మీడియా టీం, పవన్ ని టార్గెట్ చేస్తూ, మూడేళ్ళు లీజ్ అంటే, మూడేళ్ళలో పవన్ పార్టీ మూసేస్తారు అంటూ ప్రచారం చేస్తున్నారు...
నిజానికి పవన్ ఎప్పుడూ చెప్తున్నట్టు, అంత భూమి అమరావతిలో కొనుక్కునే స్థోమత లేక, లీజు పద్ధతిలో భూమి తీసుకున్నారు... పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా, ఇలా లీజు కు తీసుకుంటూ ఉంటారు... ఇది తప్పుబట్టాల్సిన పని లేదు... అయితే, విజయవాడలో జగన్ చేసింది ఏంటి ? జగన్ పార్టీ విజయవాడలో పార్ధసారధికి చెందిన భూమిలో, తాత్కాలిక కార్యాలయం నిర్మించింది... మరి ఇది పెర్మనెంట్ ఎందుకు కాదు ? అంటే జగన్ కూడా పార్టీ ఎత్తేస్తాడా ? ఇప్పటి వరకు జగన్, ఒకే ఒకసారి అక్కడకు వచ్చారు.. పార్టీ కార్యక్రమాలు కూడా అక్కడ ఏమి జరగటం లేదు... ఇలా ఉన్న జగన్ పార్టీ, మంచి ఉద్దేశంతో వస్తున్న పవన్ కళ్యాణ్ ను అనటం ఆశ్చర్యంగా ఉంది అని రాజాకీయ పరిశీలకులు అంటున్నారు...