ఇటీవల వైఎస్ఆర్ పార్టీలో, రఘురామకృష్ణం రాజుకి షోకాజ్ నోటీస్ ఇస్తున్న సమయంలో, ఆయనకు ఇచ్చిన లెటర్ హెడ్ పై చోటు చేసుకున్న వివాదం, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. రఘురామకృష్ణం రాజుకి ఇచ్చిన లెటర్ హెడ్ లో, పార్టీ పేరుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుగా, వినియోగించటం పైన, ఆ పార్టీ సొంత ఎంపీనే అనుమానం వ్యక్తం చేసారు. తనకు ఇచ్చిన బీఫారంలో యువజన శ్రామిక రైతు పార్టీ అని ఇచ్చి, ఇప్పుడు లెటర్ హెడ్ లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ అని ఉండటం పై అభ్యంతరం తెలిపారు. అయితే ఇప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొక పార్టీ ఉండటంతో, ఇప్పటికే జగన్ పార్టీ, ఎన్నికల కమీషనర్ నుంచి గతంలోనే, వైఎస్ఆర్ పార్టీ అని ఎక్కడా ఉపయోగించకూడదు అంటూ, ఆదేశాలు వచ్చాయి. అయితే అవి పట్టించుకోకుండా, ఇంకా అదే వాడటం పై, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అభ్యంతరం చెప్పింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రద్దు చెయ్యాలి అంటూ, ఢిల్లీ హైకోర్టులో, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసింది.

ఆ పార్టీ అధ్యక్షుడు మెహబూబ్ భాషా, కోర్టును ఆశ్రయించారు. తన పిటీషన్ లో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తో పాటుగా, ఎలక్షన్ కమిషన్ ని ప్రతి వాదులుగా చేర్చారు. తన పార్టీ పేరు దుర్వినియోగం చేస్తున్నారని, ఇప్పటికే మెహబూబ్ భాషా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యంతరం చెప్పినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రతి స్పందన లేక పోవటంతో, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాషా, ఢిల్లీ హైకోర్ట్ కు ముందుకు న్యాయ పోరాటానికి దిగారు. ఎన్నికల కమిషన్ ఢిల్లీ పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఢిల్లీ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమీషనర్ ఇచ్చిన నిబంధనలు మేరకు, వైఎస్ఆర్ అనే పేరుని, అధికార కార్యకలాపాలాలో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఉపయోగించకూడదు అని చెప్పారని, దీని పై కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read