గత కొద్ది రోజులుగా రెచ్చిపోతున్న వైసీపీ, ఈ రోజు మరింతగా దిగజారింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంపటానికి కూడా వేనుకాడము అన్నట్టు ప్రవర్తిస్తుంది. గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చాకార్యక్రమానికి ఇరు పార్టీల కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. గాయపడిన కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన పై, అక్కడ స్థానికి ఎమ్మల్యే పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ ఇది "వైఛీపీ నాయకుల ఆగడాలకు అంతేలేదా? గతంలో ఎప్పుడైనా, ఏనాడైనా మన వినుకొండలో ఇలాంటి ఘటనలు మనం చూశామా? వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే విషయం వైఛీపీ నాయకులకు తెలిసిపోయినట్లుంది. అందుకే దాడులకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న జనసేన కార్యకర్తలపై మీ పార్టీ రౌడీ మూకలు రాళ్లదాడి చేశాయి. ఇప్పుడు నియోజకవర్గం టీవీ9 నిర్వహించిన డిబేట్లో పాల్గొనే దమ్మూ, ధైర్యం లేక అమాయక ప్రజల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ఇనుప రాడ్లతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన నియోజక వర్గంలో ఎప్పుడైనా, ఏనాడైనా ఇలాంటి ఘటనలు మనం చూశామా.? ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు."
"అమాయక ప్రజల మీదా మీ ప్రతాపం.? అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ భరించాం.. కానీ అమాయక ప్రజలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాను. మీ రౌడీల దాడిలో తెలుగు యువత అధ్యక్షుడు ఘంటా బలరాం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ అరాచకాలు. మీ పార్టీ వాళ్లే ఈ నియోజక వర్గంలో ఉండాలా? మిగిలిన ప్రజల్ని ఉండనివ్వరా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు."