అమరావతి ఉద్యమం పై, అతి పెద్ద కుట్ర జరుగుతుంది. అమరావతిలో అసలు ఉద్యమమే లేదని, అక్కడ రైతులు ఎవరూ ఉద్యమాలు చెయ్యటం లేదని, ఇది 5 కోట్ల మంది సమస్య మాదని, ఇది కేవలం 5 వేల మంది సమస్య అని, చాలా పరిమితమైన సమస్య అని, అది కూడా ఈ 5 వేల మంది రియల్ ఎస్టేట్ చేసుకునే వారు చేస్తున్న ఉద్యమం అంటూ, ఢిల్లీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. ఒక పక్క 47 రోజులుగా అమరావతిలోని 29 గ్రామాల రైతులతో పాటు, వివిధ జిల్లాల్లో కూడా అమరావతికి మద్దతుగా ఉద్యమం నడుస్తుంది. విదేశాల్లో కూడా, ఉన్న తెలుగు వారు, అమరావతికి మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై, పార్లమెంట్ లో పోరాటానికి సిద్ధం అవుతుంది. పార్లమెంట్ వేదికగా, గత 50 రోజలుగా అమరావతిలో జరుగుతున్న ఉద్యమం, ప్రభుత్వ వైఖరి, జగన్ తుగ్లక్ నిర్ణయాల పై, ఈ దేశానికీ తెలిసేలా చెప్తాం అని తెలుగుదేశం పార్టీ అంటుంది. అలాగే, రైతుల పై పోలీసులు చేసిన దాడులు పై, హైకోర్ట్ లో కేసు నడుస్తుంది.
హైకోర్ట్ కూడా ప్రభుత్వం, పోలీసుల పై తీవ్రంగా స్పందించింది. ఇక మరో పక్క, మహిళల పై ప్రవర్తించిన తీరుకి నిరసనగా, జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం వద్ద కూడా, రైతుల పై ప్రభుత్వం చేసిన దాడులు విషయాల పై కంప్లైంట్ ఉంది. ఇక జాతీయ పత్రికల్లో కూడా, అమరావతి విషయం పై, తుగ్లక్ నిర్ణయం అంటూ కధనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో, పార్లమెంట్ వేదికగా ఈ విషయం పై చర్చింటానికి, టిడిపి సిద్ధమైన నేపధ్యంలో, వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ వేదికగా, కేంద్రంలో ఉన్న పెద్దలకు, ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. అసలు అమరావతిలో ఉద్యమమే జరగటం లేదని, అది కేవలం 2-3 గ్రామాల పరిమిత ఉద్యమం అని రిపోర్ట్ ఇచ్చినట్టు, ఒక ప్రముఖ టీవీ కధనం ప్రసారం చేసింది.
దీని కోసం, వారు గత మూడు రోజులుగా జరిగిన సంఘటనలు, వాటి ఫోటోలు, వీడియోలు కూడా, కేంద్రానికి ఇచ్చారు. విశాఖపట్నం ప్రజలు, అమరావతిని వ్యతిరేకిస్తూ, విశాఖ టిడిపి ఆఫీస్ పై దాడి చేసారని చెప్పారు. కాని, అది చేసింది వైసీపీ అని అందరికీ తెలిసిందే. అలాగే రాయలసీమ ప్రజలు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారని, చివరకు నందమూరి బాలకృష్ణను కూడా అడ్డుకున్నారని చెప్పి, ఆ ఫోటోలు, వీడియోలు కూడా ఇచ్చారు. అది కూడా చేసింది, వైసీపీనే. అలాగే తెనాలిలో, అమరావతి పై శిబిరం పై, అక్కడి ప్రజలు దాడి చేసారని చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చేసింది వైసీపీనే. ఇలా ఇలాంటి సంఘటనలు అన్నీ ప్రజలు చేస్తున్నారని, చెప్పే ప్రయత్నం చేస్తూ, ఫోటోలు, వీడియో ఆ రిపోర్ట్ లో ఇచ్చారని తెలుస్తుంది. అంటే, 47 రోజులుగా ఎక్కడా ఆందోళనలు లేని అమరావతి ఉద్యమంలో, గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనలు, తరువాత ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలు చూస్తుంటే, అమరావతి ఉద్యమం పై ఏ స్థాయి కుట్రలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి, కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి కూడా ఢిల్లీ వెళ్లి, ఉద్యమం గురించి, కేంద్ర పెద్దలకు వివరిస్తుంది.