జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే... అయితే, ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు, ఎవరూ అధికారికంగా పవన్ కామెంట్స్ మీద రియాక్ట్ కావద్దు, సోషల్ మీడియాలో అనధికారికంగా పవన్ ను టార్గెట్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు... కాని జగన్ మాత్రం తట్టుకోలేక ఆదివారం పాదయత్రలో పవన్ పై విమర్శలు చేశారు.. ఓ సినిమా ఆక్టర్ అస్తున్నాడు అంటూ హేళనగా మాట్లాడారు... అంతే, స్పీచ్ అయిన వెంటంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి, జగన్ కు ఫోన్ చేశారు... మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేశారు...

jagan pk 12122017 2

అసలు పవన్ విషయంలో జగన్ పార్టీ పూర్తి కన్ఫ్యూషన్ లో ఉంది... పవన్ మాటలకు కౌంటర్ ఇవ్వకుండా ఉండలేరు... కౌంటర్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు ప్రయారిటీ ఇస్తున్న భావన ప్రజల్లోకి వెళ్తే, చివరకి అది జగన్ * పవన్ అవుతుంది, చంద్రబాబు హాయగా ఎంజాయ్ చేస్తారు అనే భావనలో ఉన్నారు.. అలా అని పవన్ ని వదిలేస్తే, పవన్ వేసే బాణాలు డైరెక్ట్ గా జగన్ కు తగులుతున్నాయి... దొంగ, దోపిడీదారు అంటున్నా, రాజకీయ ప్రత్యర్థి ఇంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నా ఏమి అనలేని పరిస్థితి... ఇంత వరకూ పవన్ పై వైసీపీ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. స్పందించడానికి సీనియర్ నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు...

jagan pk 12122017 3

ఒక వేళ పవన్ కల్యాణ్ ను తీవ్రంగా విమర్శిస్తే.. కచ్చితంగా పవన్ కూడా రియాక్టవుతారు. దాని వల్ల ప్రయారిటీ అంతా వైఎస్సార్ కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ విఫలమైనట్లుగా ప్రచారం సాగుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి వస్తే.. అది వైసీపీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా జనసేన ప్రొజెక్ట్ అయితే.. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలనే దెబ్బకొడుతుందనే ఆందోళనలో ఉన్నారు. అంతే కాదు, అవసరమైతే జనసేనతో పొత్తు కూడా ఉంటుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పటం కూడా, విమర్శలు చేయ్యకపోవటానికి ఒక కారణం... అందుకే జగన్ ఆదివారం ఆ వ్యాఖ్యలు చెయ్యగానే, ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి, దయచేసి అనవసర తలనొప్పులు నాకు పెట్టమాక, నువ్వు చేసే తప్పులు సరి చెయ్యలేక నాకు చుక్కలు కనపడుతున్నాయి అని, జగన్ ను వారించారు... అందుకే పవన్ పై మౌనం అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read