అసెంబ్లీ వేదికగా నేను ఆరుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు, కాని నేను అలా తీసుకోను అని చెప్పన జగన్, రూటు మార్చి వేరే రూపంలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్ లు అన్నీ తిరగేసి, ఎక్కడన్నా తేడా ఉందా, లేకపోతే ఏదన్న చిన్న లూప్ హోల్ దొరికినా, వారి పై కేసులు వేసి, ఎమ్మెల్యే పదవికి అనర్హత వేయ్యాలని కోర్ట్ కు వెళ్లారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల పై ఇలా చేసారు వైసీపీ నేతలు. నలుగిరి పై వైసీపీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామ కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్‌రావు, అచ్చెంనాయడుల ఎన్నికను రద్దు చేయాలని అందులో కోరారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. ఆయన అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించలేదని, 2007లో ఓబులాపురం గనుల క్వారీ వద్ద దౌర్జన్యానికి పాల్పడితే కేసు ఉందని చెప్తున్నారు.

ఇక ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం బలరాం పై కూడా ఇలాగే వేసారు. అందుకే ఆయన ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టులో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టులో కేసు వేసారు. కారణం బలరాం, ఒక సంతానం గురించి అఫిడవిట్ లో రాయలేదని అందుకే కోర్ట్ అనర్హత వేటు వెయ్యాలని కోరారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు కూడా వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆయన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గోట్టేరాని పిటీషన్ లో చెప్పారు. ఇక మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎన్నిక పై కూడా, వైసీపీ నేత పేరాడ తిలక్ అభ్యంతరం చెప్తున్నారు. అచ్చెన్నాయుడు తన ఎన్నికల అఫిడవిట్‌లో, తనపై అరెస్ట్‌ వారెంట్‌ను దాచిపెట్టారని తిలక్ ఆరోపిస్తున్నారు. మొత్తంగా, ఇలా అఫిడవిట్ లు అన్నీ చూసి, ఎదో ఒక తప్పు పట్టుకుని, తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేల పై అనర్హత వేటు వేయించి, తరువాత స్థానంలో ఉన్న తమ పార్టీ నేతలను ఎమ్మల్యేలుగా చేసుకునే ప్లాన్ వేసారు. మరి తెలుగుదేశం కూడా ఇలా రివర్స్ ప్లాన్ వేసి, 151 మంది అఫిడవిట్లు కూడా ఇలాగే చూసి, ఎదో ఒకటి పట్టుకుని కోర్ట్ కు వెళ్తే, ఎలా ఉంటుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read