కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా, మన దేశంలో పెట్టుబడి పెడుతుంది అనగానే, ఎన్నో పెద్ద రాష్ట్రాలు, కియాని తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి విశ్వ ప్రయత్నాలు చేసాయి. అందులో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా కియాని తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి పోటీ పడ్డాయి. అయితే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ, ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో, కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి. కియాతో పాటు, ఎన్నో అనుభంద సంస్థలు కూడా అనంతపురం వచ్చాయి. అయితే మొన్న అసెంబ్లీలో బుగ్గన గారు ఒక లెటర్ చూపించి, హైలీ respected రెడ్డి సర్ నేమ్, జగన్ గారికి అంటూ, కియా ప్రెసిడెంట్ ఉత్తరం రాసారని, 2007లో అప్పట్లో వైఎస్ఆర్ పెట్టుబడి పెట్టమని అడిగారని, అందుకే ఏపిలో పెట్టుబడి పెట్టారని చెప్పిన సంగతి తెలిసిందే.

kia 02082019 2

అయితే ఇంత గొప్పగా వైసీపీ నాయకులు, కియా మా వైఎస్ఆర్ వల్లే వచ్చింది, అని చెప్పుకుంటుంటే, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు మాత్రం, కియాలో పని చేస్తున్న వారిని బెదిరిస్తున్నారు. మూడు రోజుల క్రితం చెన్నేకొత్తపల్లిలో జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సదాశివం అనే వ్యక్తి, కియ మోటార్స్‌లో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సదాశివం చెన్నేకొత్తపల్లిలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, కియాలో నరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక రోజు, వైసీపీ మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డి, బసంపల్లి మాజీ సర్పంచు డోలా రామచంద్రరెడ్డి, సదాశివం ఇంటికి వచ్చారు. మేము అడిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అంటూ సదాశివంని బెదిరించారు.

kia 02082019 3

మీరు లక్షలు లక్షలు సంపాదిస్తుంటే, మేము ఇక్కడ చూస్తూ కూర్చుంటామా, మేము చెప్పినట్టు మీరు వినాలి, మా వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే, మేము వేరే విధంగా మాట్లాడాల్సి ఉంటుంది అంటూ, బెదిరించారు. అయితే, ఏమి చెయ్యాలో అర్ధం కాని సదాశివం, భయం వేసి, వారిని సముదాయించి తన ఇంటి నుంచి పంపించివేసారు. తరువాత, వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఆయనకు, గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరొక నాయకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరి పై సీకేపల్లి పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసారు. అయితే, ఇంత పెద్ద పరిశ్రమ వస్తే, ఇలా రాజకీయ బెదిరింపులకు పాల్పడటం ఏంటని జిల్లా వాసులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read