లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగానికి ముందే వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు... ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... అయితే... ప్రధానమంత్రి ప్రసంగించే సమయానికే వైసీపీ సభ్యులు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.... అసలు ప్రధాని ముందే ఆందోళన చెయ్యాలని మిత్రపక్షం తెలుగుదేశం నిర్ణయిస్తే, పోరాడాల్సిన, ప్రతిపక్షం, ఇలా చెయ్యటం ఆశ్చర్యానికి గురి చేసింది...
మరో పక్క, తెలుగుదేశం ఎంపీలను, స్పీకర్ మందలించారు... లోక్ సభలో సభ్యుల ప్రసంగాలను అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. .. ఆందోళన విరమించి తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవలసిందిగా పదేపదే కోరినా తెలుగుదేశం ఎంపీలు అంగీకరించకపోవడంతో స్పీకర్ వారిని చిన్న పిల్లల్లా వ్యవహరించవద్దంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ మందలించారు...
మరో పక్క, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేయగా, ఏ మాత్రం బెట్టువీడను అని చంద్రబాబు, తన మనసులోని ఉద్దేశాన్ని ఆయన ముందు స్పష్టం చేశారు. .. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, తాము కోరుతున్నది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమనేనని చంద్రబాబు వెల్లడించారు.