మొన్నటి దాక తెలుగుదేశం పార్టీ డేటా దొంగతం చేసిందని, వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆధార డేటా మొత్తం తెలుగుదేశం పార్టీ దొంగతనం చేసింది అంటూ, హడావిడి చేసారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ చేసిన డేటా దొంగతనం ఏమో కానీ, ఇప్పుడు మాత్రం వైసీపీ అధికారంలోకి అదే పని చేసినట్టు అర్ధమవుతుంది. గ్రామాల్లో వాలంటీర్లను నియమిస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే అవన్నీ వైసీపీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చే స్కెచ్ వేసారు. దీని కోసం, వైఎస్‌ఆర్‌విలేజ్ సేవక్ డాట్ కామ్ అనే వెబ్సైటు మొదలు పెట్టారు. వాలంటీర్లగా ఉండాలి అనుకువే వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలంటూ వెబ్‌సైట్ మొదలు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో కూడా వైసీపీ వెరిఫైడ్ ఎకౌంటు నుంచి కూడా పోస్ట్ చేసారు. దీంతో అందరూ ఇదే ప్రభుత్వం వెబ్సైటు అనుకుని రిజిస్టర్ అవ్వటం మొదలు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు కాకుండా, సామాన్యులు కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యారు.
అయితే ఈ వెబ్సైటులో ధరకాస్తు ఫిల్ చేసే సమయంలో, పేరుతో పాటు కీలకమైన ఆధార్ వివరాలను కూడా సేకరించారు. ఆధార నెంబర్ ఎంటర్ అవ్వగానే, డీటెయిల్స్ వచ్చేయటంతో ఇదో సంచలనంగా మారింది. ఒక పార్టీ పెట్టిన ప్రైవేట్ వెబ్‌సైట్ల ద్వారా ఆధార్ వివరాలు సేకరించడం అనేది చట్టానికి విరుద్ధం. ఇది కూడా డేటా చోరీ కిందకే వస్తుంది. అయతే ఈ విషయం నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, వైఎస్‌ఆర్‌విలేజ్‌సేవక్ అనే వెబ్‌సైట్ ను వెంటనే తొలగించారు. అయితే ఈ వెబ్సైటుతో మాకు సంబంధం లేదు అంటూ వైసీపీ ప్రకటించింది. కాని, ఇదే వెబ్సైటు అంటూ వైసీపీ వెరిఫైడ్ సోషల్ మీడియా పేజి లో ఉండటం మాత్రం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ వెబ్సైటు వివాదం పెద్దది కాక ముందే తెలివిగా, వైసీపీ ఆ వెబ్సైటు తొలగించింది. నిన్నటి నుంచి పార్టీ ఫిరాయింపులు అంశం వార్తల్లో ఉండటంతో, ఈ విషయం పై అటు ప్రతిపక్షం తెలుగుదేశం కూడా పట్టించుకోలేదు. దీంతో, ఈ అంశం నుంచి వైసీపీ తెలివిగా బయట పడింది.