ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత 50 రోజులుగా సాగుతున్న మూడు ముక్కల రాజధాని రగడ, ప్రస్తుతానికి, మండలిలోని సెలెక్ట్ కమిటీ వద్ద, కోర్ట్ ల వద్ద ఆగి ఉంది. జగన్ మోహన్ రెడ్డి, ఆఘమేఘాల మీద, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి, సెక్రటేరియట్ ని తీసుకుని వెళ్ళి, విశాఖపట్నంలో పెట్టాలని, ఎంత స్పీడ్ గా ఈ విషయం జరిగితే తనకు అంత మంచిది అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా, అసెంబ్లీలో ప్రకటన చెయ్యటం, తరువాత క్యాబినెట్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు, ఇలా అన్నీ చెకచెకా జరిగిపోయాయి. మధ్యంలో వచ్చిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్, బోస్టన్ కమిటీ రిపోర్ట్ కూడా తమ పాత్ర పోషించాయి. అయితే, ఇంత స్పీడ్ లో వెళ్తున్నప్పుడు సహజంగా బ్రేక్ అనేది పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. జగన్ స్పీడ్ ని, శాసనమండలి ఆపింది. రాజధానిని మూడు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై, శాసనమండలి , సెలెక్ట్ కమిటీకి రెఫెర్ చేస్తూ తీర్మానం చేసింది. అయితే, శాసనమండలిలో సహజంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వైట్ ఉండటంతో, వారు జగన్ దూకుడుకు బ్రేక్ వేసారు.
అయితే జగన్ మాత్రం ఆగలేదు. తన నిర్ణయానికి ఆడ్డు వచ్చిన, శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్ పెట్టారు. అయితే ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు, మండలి ఉంటానే ఉంటుంది. ఈ నేపధ్యంలోనే, శాసనమండలి చైర్మెన్, సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించాల్సిందిగా అన్ని పార్టీలకు లేఖలు రాసారు. అయితే వైసీపీ ప్రభుత్వం, మండలి సెక్రటరీ మీద ఒత్తిడి తెచ్చి, ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళనివ్వటం లేదు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇపుడు అన్ని పార్టీల వారు, శాసనమండలి చైర్మెన్ కు సెలెక్ట్ కమిటీ సభ్యులను పంపుతూ, పేర్లు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ కు చెందిన పార్టీలు, చైర్మెన్ కు లేఖలు ఇచ్చారు. కాని అధికార వైసీపీ మాత్రం, సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వలేదు.
తాము సెలెక్ట్ కమిటీలో ఉండదలుచుకాలేదని, పేర్లు ఇవ్వం అని, సెలెక్ట్ కమిటీ ప్రక్రియ అనేది, రాజ్యాంగ విరుద్ధమని, అందుకే ఈ ప్రక్రియలో తాము, భాగస్వాములు అవ్వదలుచుకోలేదు అని చెప్తూ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలి చైర్మెన్ కు లేఖలు రాశారు. ఈ నేపధ్యంలో వైసీపీ లేకుండా సెలెక్ట్ కమిటీ తన పని ప్రారంభించే అవకాసం కనిపిస్తుంది. మొత్తం రెండు సెలెక్ట్ కమిటీల్లో, ఒక్కో దాంట్లో, 8 మంది సభ్యులు ఉంటారు. సీఆర్డీఏకు సంబంధించిన కమిటీలో టిడిపి తరుపున దీపక్‌రెడ్డి, బీదా రవిచంద్ర, బచ్చుల అర్జునుడు, గౌరవాని శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు కమిటీలో, లోకేష్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, గుమ్మడి సంధ్యారాణి పేర్లను టీడీపీ పంపించింది. బీజేపీ నుంచి ఒక కమిటీకి మాధవ్, సీమరో కమిటీకి సోము వీర్రాజు పేర్లు పంపించారు. పీడీఎఫ్ నుంచి కేఎల్ లక్ష్మణరావు,ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లను ఛైర్మన్‌కు పంపారు. బుధవారం నాడు, ఈ కమిటీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.