ప్రకాశం జిల్లా రైతుల కరవుబాధలను, కరవుగాధలను, మా జిల్లా యొక్క రైతాంగం గుండెకోతను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, టీడీపీకి చెందిన ముగ్గురం ఎమ్మెల్యేలం లేఖరాస్తే, దానిపై వైసీపీ మూకలు, నీలిమీడియా అవాకులు చెవాకులు పేలుతూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని టీడీపీనేత, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామితో కలిసి లేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! 2005 నుంచి ప్రకాశం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. మూడేళ్లపాటు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితులు ప్రకాశం జిల్లాలో ఏర్పడ్డా యి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నదిపై మహారాష్ట్ర, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపాము. ప్రకాశంజిల్లా రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని, మా జిల్లా రైతుల ఆవేదనను బాధ్యతగల ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రికి లేఖ ద్వారా వివరించాము. లేఖలో తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పుకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, ఇరిగేషన్ శాఖామంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని రైతాంగం, రైతుకూలీలకు వ్యవసాయం తప్ప, మరో జీవన ప్రత్యామ్నాయం లేదు. ఇవేవీ గమనించకుండా, బాధ్యతగల మంత్రి స్థానంలో ఉండి ఆలోచించకుండా మాట్లాడటం దుర్మార్గం. తాము లేఖలో స్పష్టంగా కొన్ని అంశాలను లేవనెత్తాము. ముఖ్యంగా శ్రీశైలం ఎగువ ప్రాంతంలో అడ్డగోలుగా సాగుతున్న నీటి వాడకాలు, అడ్డగోలుగా నిర్మిస్తున్న నీటిపారుదల స్కీమ్ లు, ప్రాజెక్టుల గురించి, వాటివల్ల జరిగే నష్టాల గురించి తెలియచేశాము. నాగార్జున సాగర్ కుడికాలువ కింద ప్రకాశం జిల్లాలోని 4.50లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో ని 6.50లక్షలఎకరాల భూమిలో సాగుప్రశ్నార్థకమవుతుందని, రెండు జిల్లాల్లో తాగు నీటి సమస్య కూడా తలెత్తుతుందని లేఖలో ప్రస్తావించాము. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో, రాయలసీమ వాసులకు ఎలా కల్లబొల్లి మాటలు చెబుతారని, రైతాంగాన్ని ఎలా మోసగిస్తారని తాము ముఖ్యమంత్రిని ప్రశ్నించాము. ముఖ్యమంత్రి పూర్తి చేస్తామంటున్న ప్రాజెక్టుల నిర్మాణం కూడా పూర్తయ్యేలా లేదు. ఎందుకంటేప్రభుత్వం దగ్గర డబ్బులేదు కాబట్టి. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని తాము లేఖలో కోరాము. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులు కట్టాలని ప్రభుత్వం భావించినట్లయితే, నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రకాశం-గుంటూరు జిల్లాల పరిస్థితిపై ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించారో కూడా చెప్పాలని కోరాము. తమ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని లేఖలోనే తాముకొన్ని ప్రత్యామ్నాయాలను కూడా సూచించాము. తెలుగుదేశం ప్రభుత్వంలో శరవేగంగా జరిగిన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఈ ప్రభుత్వం ఇంత వరకు పూర్తిచేయ లేక పోయింది. వీలైనంత త్వరగా అదిపూర్తిచేసి, ప్రకాశంజిల్లా లోని పశ్చిమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలని కూడా లేఖలో సూచించాము.

చంద్రబాబునాయుడు గతంలో ఎంతో ముందుచూపుతో గోదావరి జలాలను నాగార్జునసాగ్ కుడికాలువలోకిఎత్తిపోసేలా ఆలోచనచేశారు. దానికి సంబంధించినపనులను మూడుదశల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఆ ఆలోచనను అమలుచేయాలని, గోదావరి జలాలద్వారా నాగార్జున సాగర్ కుడికాలువపరిధిలోని ఆయకట్టుకి నీరందించాలని కూడా ముఖ్యమంత్రిని లేఖలో విజ్ఞప్తిచేశాము. ప్రకాశంజిల్లాలోని మెట్టప్రాంతాల్లో పంటకుం టలతవ్వకంచేపట్టాని, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిని అమలుచేయాలని కోరాము. గుంటూరు ఛానల్ ను దగ్గు బాడు వరకు పొడిగించి, ప్రకాశంజిల్లాలోని దుర్భిక్ష మండ లాలకు నీరందేలాచూడాలని కోరాము. మేము లేఖలో ముఖ్యమంత్రిని కోరిన ఏఒక్కఅంశంపైనా ఇరిగేషన్ మంత్రి మాట్లాడలేదు. అవన్నీ వదిలేసి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. ఎన్నోకట్టుకథలు, మోసా లు, కుయుక్తులతో అధికారంలోకి వచ్చినవైసీపీప్రభుత్వం, అధికారంలో ఉండికూడా కల్లబొల్లి, మాయమాటలతోనే పబ్బం గడుపుకోవాలనిచూస్తోంది. గతేడాది నాగార్జున సాగర్ లో నిండానీరున్నా, ప్రకాశంజిల్లాలో ఒక్కపంటకు నీరివ్వడానికే ప్రభుత్వం ఆపసోపాలుపడింది. తక్కువనీటితోవ్యవసాయం చేస్తూ, అరకొరగా పంటలు పండిస్తున్న ప్రకాశంజిల్లా రైతాంగంవైపు ప్రభుత్వం కన్నెత్తి చూడటంలేదు. శనగ, పొగాకు వంటిఉత్పత్తులు కొనేవారు లేకుండాపోయారు. ఇవేవీప్రభుత్వం ఆలోచించడం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా, ప్రకాశంజిల్లాప్రజాప్రతినిధులుగానే తాముమాట్లాడాముతప్ప, రాయలసీమ రైతాంగానికి నీరివ్వ వద్దనిచెప్పలేదు. రాయలసీమ జిల్లాలకంటే దుర్భిక్షమైన పరిస్థితులున్న ప్రకాశంజిల్లాకు ముందుప్రభుత్వం న్యాయం చేయాలి. తక్షణమే వెలిగొండప్రాజెక్ట్ నుపూర్తిచేయాలి. చంద్ర బాబునాయుడి హాయాంలో బ్రహ్మండంగా ప్రాజెక్ట్ పనులు సాగాయి. రైతాంగంకోసం తాము లేవనెత్తిన డిమాండ్లపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి. ప్రకాశంజిల్లా రైతాంగం సమస్యలు నీటిపారుదల శాఖామంత్రికి తెలిసినట్లులేవు. వైసీపీకిచెందినఆజిల్లా ప్రజా ప్రతినిధులు ప్రకాశంజిల్లాలోని రైతులసమస్యలను మంత్రికి చెప్పినట్లుగా లేరు. ఒకవేళవారుచెప్పినా మంత్రి అవేవీ పట్టించుకోవడంలేదని,ఆయనమాటల్ని బట్టి తెలుస్తోంది. అధికారపార్టీనేతలు వారిరాజకీయప్రయోజనాలకోసం ప్రకా శం జిల్లా తాంగాన్ని బలి పీఠం ఎక్కించ వద్దని కోరుతున్నాం. నాగార్జునసాగర్ కుడికాలువకు నీరొస్తేనే ప్రకాశంజిల్లా వాసులగొంతులుతడుస్తాయి... వారిభూముల్లో పచ్చదనం కనిపిస్తుంది. అదితప్ప, వేరేనీటి వసతిలేదు. అతివర్షాలవల్ల ఏటా పంటలు పాడవుతూనేఉన్నాయి. ప్రకాశంజిల్లా రైతాంగం అనేకసవాళ్లు, సమస్యల మధ్యనవ్యవసాయం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తో విందులు, వినోదాలు చేసుకోవడానికి సమయం ఉంటుంది గానీ, రైతులసమస్యలు తీర్చడానికి సమయం లేదా? ఓట్లేసినప్రజలు కష్టాల్లోఉన్నప్పుడు వారిబాధలు, వెతలు ఈముఖ్యమంత్రికి పట్టవా? రాష్ట్ర హక్కులను, ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యాడని ప్రజలకు అర్థమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read