దేశంలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు విడివిడిగా ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉంటే.. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఇటు బీజేపీ కూడా నాలుగు రాష్ట్రాల ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమై ఉంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ఉద్ధండులు ప్రచారం చేసినప్పటికీ మూడు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడం కమలం శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నాళ్లూ మోదీ మేనియాతో నెట్టుకొచ్చిన బీజేపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికలు పరీక్ష పెట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని మరో అంశం కలవరపెడుతోంది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తేనే ఓట్లు రాలవన్న విషయం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

yogi 27122018 3

మరో కొసమెరుపేంటంటే.. మోదీ, ఆదిత్య నాథ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటు షేర్ పతనం కావడం పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేసే అంశం. మిజోరం విషయం పక్కనపెడితే.. మోదీ, ఆదిత్యనాథ్ పర్యటించిన ఛత్తీస్‌గర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో గణాంకాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఛత్తీస్‌గర్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 18, రాజస్థాన్‌లో 26, తెలంగాణలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రచారం చేసిన 55 నియోజకవర్గాలకు గానూ 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గింది. 7 స్థానాల్లో ఓట్ల శాతం పెరిగింది. యోగి ఆదిత్య నాథ్ మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు.

yogi 27122018 4

ఛత్తీస్‌గర్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 11, రాజస్థాన్‌లో 26, తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూపీ సీఎం ప్రచారం చేసిన 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గింది. 11 స్థానాల్లో పుంజుకుంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ మొత్తం 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఛత్తీస్‌గర్‌లో 19, మధ్యప్రదేశ్‌లో 20, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన 75 నియోజకవర్గాలకు గానూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 58 నియోజకవర్గాల్లో పెరిగింది. 12 స్థానాల్లో ఓట్ల శాతం తగ్గింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read