పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాన నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ ఎంపీల ను బెదిరించారు. మాపై కేసులు పెడుతారా..? టీడీపీ ఎలాంటి కేసులకూ భయపడదు. మోడీనే కాదు కొండనైనా ఢీకొనే సత్తా మాకుం దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాజకీయాల్లో నేనే సీనియర్‌ని. మోడీకంటే ముందే ముఖ్యమంత్రినయ్యాను. అవకాశం వచ్చి ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. వారికేమో పెద్ద మెచ్యూరిటీ ఉన్నట్లు నన్ను విమర్శిస్తున్నారు. ప్రధాని వైకాపా మాయలో పడి హుందాతనాన్ని కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించే ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమా నంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో పేరూరు కు విచ్చేశారు. పేరూరు ప్రాజెక్టు పరిశీలించిన అయన పైలాన్‌ ఆవిష్కరించడంతో పాటు అక్కడే నిర్మిం చిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పేరూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్య క్రమంలో ప్రజలతో ముచ్చటించారు.

cbn 02082018 2

కేంద్రం సహకరించకపోయినా.. పోలవరం ప్రాజెక్టు పనులు కొన సాగిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం అంతా హైదరాబాద్‌కే వెళ్తోంది. అయినా.. ఎక్కడా వెనక డుగు వేయకుండా సంక్షేమాభివృద్ధి పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. రైల్వే జోన్‌ ఇస్తామని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో చెబితే.. ఇవ్వలేమని కోర్టులో పిటిషన్‌ వేశారన్నారు. మోడీ అవినీతి ప్రక్షాళాన ఏమైందని.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు ఇంత వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఏటిఎంల్లో డబ్బు రాదని.. డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది మోడీ కాదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనను ప్రధాని మోడీ విమర్శించడం దురదృష్టకరమన్నారు. మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రిని అయిన వాడిని.. అలాంటి నాకు మీరు రాజకీయాలు నేర్పిస్తారా అన్నారు. మీకు అవకాశం వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. తమను కించపరిచే విధంగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

cbn 02082018 3

దగా పడ్డ రాష్ట్రం కోసం.. నా ప్రజల కోసమే ఎన్డిఎలో చేరానన్నారు. అయితే.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎలా వైదొలగకుండా ఉంటామన్నారు. యూ టర్న్‌ తీసుకున్నది తాను కాదని.. తెలుగు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి బిజేపియే యూటర్న్‌ తీసుకుందన్నారు. తాను రైట్‌ టర్న్‌లో ఉన్నానన్నారు. వైసిపి ట్రాప్‌లో పడ్డానని మోడీ చెబుతున్నారు. వాస్తవానికి వైసిపి అవినీతి కుడితిలో పడింది బిజేపియేనన్నారు. అవినీతిని రూపుమాపుతామని చెప్పిన ప్రధాన మంత్రి ఇప్పుడు అవినీతి కేసులున్న వైసిపితో స్నేహం చేయడం అవకాశవాద రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఏ1, ఏ2లను తన కార్యాలయంలో ఉంచుకుని అవినీతిని ఏవిధంగా నిర్మూలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన వైసిపి బిజేపికి వూడిగం చేస్తోందని మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read