పది రోజులు క్రితం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై, యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రతి రోజు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై విద్యార్ధి సంఘాలు మండి పడుతున్నాయి. పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2.30 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, రెండేళ్ళ తరువాత, కేవలం 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటూ ప్రకటన ఇవ్వటం పై విద్యార్హులు మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కేవలం 36 పోస్టులు ప్రకటించటం, అలాగే సున్నా ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రకటించటం, వేళల్లో పోలీస్ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే, కేవలం 400 ఉద్యోగాలు ప్రకటించటం, ఇలా అనేక అంశాల పై యువత, జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకుని వస్తాను, ఇక ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోతుంది, ఉద్యోగాలే ఉద్యోగాలు అని చెప్పి, ఇప్పుడు ప్రత్యెక హోదా దేవుడి దయ ఉంటేనే వస్తుందని జగన్ మాట మార్చటం, పైగా కంపెనీలు అన్నీ ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోతూ ఉండటం, ఒక్క కొత్త పెట్టుబడి కూడా రాకుండా ఉండటం, ఇలా అనేక అంశాల పై యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
అటు ప్రైవేటు ఉద్యోగాలు లేక, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించక ఎలా బ్రతకాలి అంటూ, యువత రోడ్డు ఎక్కారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్ధి సంఘాలు చలో కలక్టరేట్ పిలుపు ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఈ రోజు అన్ని జిల్లాల్లో యువత రోడ్డు ఎక్కారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి విద్యార్ధి సంఘాలు వెళ్ళాయి. డీఆర్‍సీ సమావేశం కోసం వాచ్చిన మంత్రులు అనిల్, బుగ్గన ఉన్నారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేసారు. అలాగే విజయనగరంలో మంత్రి బొత్స ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసారు. విశాఖలో మంత్రి అవంతి ఇల్లు ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేసాయి. ఇక తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. అలాగే మంత్రి ఆళ్ళ నాని ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు అలెర్ట్ అయ్యి, ఎక్కడికక్కడ విధ్యార్ధులను అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, యువత ఎదురు తిరగటం మొదలు పెట్టింది.