వైఎస్ వివేకా కేసులో మరో సంచలనం తెర మీదకు వచ్చింది. వైఎస్ వివేకా కేసుకు సంబంధించి పలు అనుమానాలు మొదట నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభం అయ్యింది. తొలత ఈ విచారణలో కొంత జాప్యం జరిగినా, ఇటీవల కాలంలో ఈ కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయతే సునీల్ యాదవ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఈ కేసులో వేగం పెరిగింది. అయితే ఈ రోజు వైఎస్ వివేక కుమార్తె, వైఎస్ సునీత, కడప జిల్లా ఎస్పీ లేఖ రాసారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఇప్పుడు ఈ లేఖలోని వివరాలు ఈ మొత్తం దర్యాప్తులోనే కీలకంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా ఉన్న విషయం, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన, దేవిరెడ్డి శివసంకర్ రెడ్డిని ఈ రోజు సిబిఐ విచారణకు పిలిచింది. ఇతను వివేక కేసులో ప్రధాన అనుమానితుడు అని , రాజకీయంగా బలంగా ఉన్న వారు ఈ కేసులో ఉన్నారు అంటూ సునీత మొదటి నుంచి చెప్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, అందులో ఈ దేవిరెడ్డి శివసంకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆగస్టు 10 సాయంత్రం 5 గంటల సమయంలో, అంటే మూడు రోజులు క్రితం, ఒక వ్యక్తి తమ ఇంటి చుట్టూ రెక్కీ చేసాడని ఆమే లేఖలో తెలిపారు.

sunitha 13082021 2

పులివెందులలో ఉండే వైఎస్ వివేక ఇంటికి ఒక వ్యక్తి రెండు పర్యాయాలు వచ్చి, రెక్కీ నిర్వహించి వెళ్ళాడని, అతని పై అనుమానం ఉందని చెప్పి, సునీత రెడ్డి ఈ రోజు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు సిసి టీవీ ఫూటేజ్ కూడా జత చేసారు. ఇదే అంశానికి పులివెందుల సిఐకి కూడా ఫిర్యాదు చేసామని, సిఐ వచ్చి విచారణ చేసి, ఆ వ్యక్తీ పోలికలు తెలుసుకున్నారని, ఆమె లేఖలో తెలిపారు. అయితే దేవిరెడ్డి శివసంకర్ రెడ్డికి సన్నిహితుడుయినా మణికంఠరెడ్డిగా ఆ వ్యక్తి ఉన్నాడని, శివశంకర్ రెడ్డి పుట్టినరోజుకి వేసిన ఫ్లెక్సీలు ఈ మణికంఠరెడ్డి ఉన్నాడని, ఇతనే తమ ఇంటి దగ్గర రెక్కీ చేసాడని సునీత తెలిపారు. తన వీధిలో, తన ఇంటి వద్ద రెక్కీ చేయటం, వీళ్ళే ప్రధాన అనుమానితులు కావటంతో, తమకు భయంగా ఉందని, పలు మార్లు తమకు ప్రా-ణ-హా-ని ఉందని చెప్తున్నామని, ఇప్పుడు తమ పైనే రెక్కే చేయటం చేస్తుంటే ఏదో జరుగుతుందని అనుమానంగా ఉందని ఆ లేఖలో తెలిపారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. దీంతో ఇప్పుడు ఈ లేఖ కీలకంగా మారింది. ఈ లేఖ విషయం పై సిబిఐ కూడా ఆరా తీసే అవకశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read