ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, జగన మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైఎస్ వివేక కేసు హైకోర్టు ఆదేశాల మేరకు, సిబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, రెండు నెలల క్రితమే సిబిఐ రంగంలో దిగింది. మొదటి విడతగా సిబిఐ 15 రోజులు పాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. తరువాత 40 రోజులు విచారణకు బ్రేక్ ఇచ్చిన సిబిఐ, వారం రోజుల క్రితం రెండో దఫా విచారణ ప్రారంభించింది. ఈ సారి విచారణలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా జరిగిన విచారణలో, కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.. నిన్నటి విచారణలో కొన్ని కీలక ఆధారాలు బయట పడినట్టు తెలుస్తుంది. పులివెందులలో చెప్పుల షాపు యజమానిగా ఉన్న మున్నా అనే వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా సిబిఐ విచారణ చేసింది. వివేక బ్రతి ఉండగా, ఆ కుటుంబానికి సంబంధించి ఒక సెటిల్మెంట్ చేసినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సిబిఐ వారిని విచారణ చేసింది.

అయితే ఆ విచారణలో మున్న బ్యాంక్ లాకర్ లో, భారీగా నగదు గుర్తించారు. దాదాపుగా ఒకే బ్యాంక్ లాకర్లో, 48 లక్షల నగదుతో పాటుగా, 25 తులాల బంగారాన్ని కూడా సిబిఐ గుర్తించింది. అలాగే మరిన్ని బ్యాంకు ఖాతాలను కూడా సిబిఐ గుర్తించింది. ఈ మొత్తం నగదు పై కూడా సిబిఐ ఆరా తీస్తుంది. అయితే ఇదే క్రమంలో ఈ రోజు పులివెందులలో మరి కొంత మందిని విచారణ చేసారు. ఏడుగురిని ఈ రోజు పులివెందులలో విచారణ చేసారు. అయితే ఈ క్రమంలో వైసీపీ ఎంపీకి చెందిన సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణ చేసిన సిబిఐ, మరింత విచారణ కోసం తన ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ని సీజ్ చేసి, లోతుగా విశ్లేషణ చెయ్యనున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తీ యురేనియం ఫాక్టరీలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో, రెండు రోజుల నుంచి కీలక పరిణామాలు ఎదురు అవుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read