వైఎస్ వివేకానందరెడ్డి హత్యని ముందు గుండెపోటు అని, ఆ తరువాత గొడ్డలిపోటని వైసీపీ ప్రచారంలోకి తీసుకొచ్చింది. సరిగ్గా ఎన్నికలకి ముందు, వైసీపీ సీట్ల ప్రకటనకి ముందు జరిగిన ఈ హత్యని వాడుకోవడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చిందని మాజీ వైసీపీ నేతే ఆరోపించారు. ఆయనెవరో కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత జగన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డిని హ-త్య చేసి నారాసుర రక్తచరిత్ర అంటూ టిడిపికి ఆ రక్తం మరకలు అంటించే ప్రయత్నం వెనుక అతి పెద్ద కుతంత్రం ఉందని ఆదినారాయణరెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్యని టిడిపిపైకి నెట్టడంలో విజయం సాధించిన వైసీపీ దీనిద్వారా టిడిపిని 50 స్థానాల్లో ఓడించిందని తెలిపారు. తన ఓటమికి వివేకానందరెడ్డి హత్యే ప్రధాన కారణమన్నారు. నియోజకవర్గమే కాదు, కడప జిల్లాలో ఎక్కడకి వెళ్లినా వివేకా హత్య తానే చేశానని వంద శాతం ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని చెప్పారు. వివేకా హత్యపై వైసీపీ వాళ్లు చెప్పింది ప్రజలు వందశాతం నమ్మేశారన్నారు. ఇప్పుడు నిజాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
వివేకా హ-త్య తరువాత, టిడిపికి ఇంత దెబ్బ పడిందా ? జగన్ గేం ప్లాన్ ఇన్నాళ్ళకు బయట పడింది.
Advertisements