వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ1గా వున్న నిందితుడు ఎర్ర గంగిరెడ్ది బెయిల్ రద్దుపై విచారణను జనవరి 3కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హత్యకేసు విచారణని తెలంగాణ రాష్ట్రానికి మార్చుతూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం వెలువరించడంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు కీలకం కానుంది. సిబిఐ దర్యాప్తునకు ముందే ప్రధాన నిందితుడు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సిబిఐ సవాలు చేయగా, బెయిల్ ఇవ్వడాన్ని కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ ఎం ఆర్ షా,జస్టిస్ సిటి రవికుమార్  ధర్మాసనం.. ఈ కేసులో వాదనలు మరింతగా వింటామని జనవరి 3కి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read