ఒక పక్క దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒక వైపు ఉండి, మోడీ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటం చేస్తుంటే, కేసీఆర్, జగన్ మాత్రం, మోడీ వైపే ఉండి భజన చేస్తున్నారు. మమత బెనర్జీ విషయంలో కూడా, వీరిద్దరూ ఇదే ఫాలో అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆన్ రికార్డులో మమత విషయం పై ఇరువురు స్పందించలేదు. మొదటి సారి, బెంగాల్‌లో జరిగిన పరిణామాల్లో అక్కడి సీఎం మమతాబెనర్జీదే తప్పని వైసీపీ తీర్మానించింది. మమతాబెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లఘించారన్నది వైసీపీ నిర్ణయమని ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మమత ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినందుకే మద్దతు ఇవ్వలేదని ఆయన చెప్పారు.
సీబీఐ అధికారులకు సహకరించడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. మమత తప్పు చేశారని ఆరోపించారు. ఆమె తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యవహారంలో మొత్తంగా వైపీసీ, ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించినట్లయింది. ఎలాంటి సమాన్లు లేకుండా బెంగాల్ కమిషనర్ ఇంటిపై దాదాపు 50 మంది సీబీఐ అధికారులు దాడికి వెళ్లడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ ప్రమేయంతోనే సీబీఐ ఇలా వ్యవహిరిస్తోందని మమత ఆరోపిస్తూ మూడు రోజుల పాటు దీక్ష చేశారు. కమిషనర్ సుప్రీంకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించడంతో ఆమె దీక్ష విరమించారు.
బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ మమత దీక్షకు మద్దతు పలికాయి. వారంత మమతకు సంఘీభావం ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్, వైసీపీలు బెంగాల్ పరిణామాలపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. రాష్ట్రాల హక్కుల కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. రెండు సార్లు మమతను కలిశారు. అయినప్పటికీ ఈ పరిణామాలపై కేసీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఫెడరల్ ఫ్రెంట్‌లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్న వైసీపీ కూడా మౌనంగా ఉంది. మమతకు సంఘీభావం తెలియజేయలేదు. మమత రాజ్యాంగాన్ని ఉల్లఘించిదని వైసీపీ నేతలు జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. మోదీకే వైసీపీ మద్దతు అని పరోక్షం చెబుతున్నారు.