నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ శ్రేణులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఒక పెద్దా క్యాంపెయిన్ నడిపారు. ఒకరు కాదు , ఇద్దరు కాదు, పార్టీ యంత్రాంగం, తమ బులుగు మీడియా, ఇలా అందరూ నడిపారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఊదరగొట్టారు. ఉద్యోగులు లంచాలు తీసుకుంటారని, ఉద్యోగులు ఈ రాష్ట్రానికి భారం అని, ఉద్యోగులు పని చేయరని, ఉద్యోగులు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తరాని, ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ, క్యాంపెయిన్లు నడిపారు. తమ సొంత ఛానెల్ లో, కామన్ మ్యాన్ వాయిస్ అంటూ, వైసీపీ నాయకులను పెట్టి, ఉద్యోగులు పై విషం చిమ్మారు. ఇక డిప్యూటీ మంత్రి అయితే, ఇంకో అడుగు ముందుకు వేసి, ఉద్యోగులు వెనుక చంద్రబాబు ఉన్నారని, అసలు దీంతో డౌట్ లేదని, ఉద్యోగుల ఉద్యమాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. ఇక చలో విజయవాడ కార్యక్రమం గురించి, సాక్షిలో , ఆ ఉద్యమంలో పాల్గుంది, మొత్తం తెలుగుదేశం, జనసేన శ్రేణులు అని కధనాలు రాసారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మార్గాల్లో, ఉద్యోగుల పై వ్యతిరేకత తేవాలో, అంత వ్యతిరేకత తెచ్చారు. కానీ ప్రజల్లో మాత్రం, ఉద్యోగుల పై వ్యతిరేకత లేదని, వాళ్ళు మంచి నీళ్ళు, భోజనాలు పెట్టిన తీరుతోనే అర్ధం అయ్యింది. అయితే నిన్న ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వెళ్ళారు.
ఆ నలుగురు ఉద్యోగ సంఘ నేతలు, ఎవరినీ సంప్రదించకుండా, సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. పీఆర్సి సాధన కమిటీ అని పేరు పెట్టుకుని, పీఆర్సి సాధించకుండానే సమ్మె విరమించారు. సిపీఎస్ రద్దు గురించి లేదు. పీఆర్సి కమిటీ రిపోర్ట్ బయటకు రాలేదు. కేవలం హెచ్ఆర్ఏ 2 శాతం పెంచారు. మిగతాది అంతా ఎలా ఉందో అలాగే ఉంది. మరి ఆ నలుగురు నేతలు ఎందుకు సమ్మె విరమించారో, వారికే తెలియాలి. అయితే ఈ నిర్ణయం పై కింద స్థాయి ఉద్యోగులు, టీచర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉంటే, నిన్నటి వరకు ఉద్యోగులను తిట్టిన వైసీపీ శ్రేణులు, ఈ రోజు నుంచి ఉద్యోగులను పొగడటం మొదలు పెట్టాయి. నిన్నటి వరకు వారి వెనకాల చంద్రబాబు ఉన్నాడు అనే వారు, ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వైసీపీ శ్రేణులు 24 గంటల్లో ఇలా మారిపోవటం, నిన్నటి వరుకు రకరకాల కధనాలు అల్లి, ఈ రోజు వారిని పొగుడుతూ కధనాలు అల్లటం చూస్తుంటే, వైసీపీ పార్టీ వైఖరి, వారి సిద్దాంతం ఏమిటో అర్ధమవుతుందని, ప్రజలు అంటున్నారు.