ఆంధ్రప్రదేశ్ లో న్యాయమూర్తులు, కోర్టులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, వారిని పార్టీలకు ఆపాదించి, కులాలకు ఆపాదించి, చేసిన వికృత క్రీడ అందరికీ తెలిసిందే. ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ లు ఉండటం సహజం. వాళ్ళని తమ పనులు చెప్పుకోవటానికి, లేకపోతే ప్రత్యర్ధులు చేసే ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పి కొట్టటానికి వాడుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం రాజ్యాంగ సంస్థల మీదకు వదిలారు. జడ్జిలను, న్యాయమూర్తులను టార్గెట్ చేసారు. వారు చేసిన పనులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ పైన చేసిన అటాక్ గురించి సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడే ఇప్పుడు అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇప్పటికే కొంత మందిని సిబిఐ అరెస్ట్ చేయగా, వారు ఇచ్చిన పక్కా సమాచారంతో, ఇదంతా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ నుంచి జరుగుతున్న వ్యవహారంగా సిబిఐ తన దర్యాప్తులో తెల్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు సిబిఐ అధికారులు డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ కు వచ్చి, కొంత మందిని విచారణ చేసి, అక్కడ నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉండగా, వారు సమాచారం తెలుసుకుని పరార్ అయినట్టు చెప్తున్నారు.

cbi 10022022 2

దీంతో సిబిఐ వేట మొదలు కావటం, ఏకంగా తమ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ వరకు కూడా, సిబిఐ వచ్చిందని తెలుసుకున్న పేటీయం బ్యాచ్ మొత్తం అలెర్ట్ అయ్యింది. ఎవరు అయితే అతిగా ప్రవర్తన చేసే వారో, వారు అందరూ ఇప్పుడు వారి ఎకౌంటు ను డియాక్టివ్ చేసుకున్న, కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తాము దొరికిపోతే, వాస్తవాలు బయట పడి పోతాయి ఏమో అని వారు పారిపోతున్నారు. అయితే ఇక్కడ ఏకంగా ప్రభుత్వం అధీనంలో ఉండే డిజిట‌ల్ కార్పొరేష‌న్ కేంద్రంగా ఇంత కుట్ర జరిగింది అంటే, ఏ స్థాయిలో వీరి నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరి వెనుక ఎవరు ఉన్నారు, ఏ స్థాయి నాయకులు ఉన్నారు, ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఇలా మొత్తం వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాచ్ లో కొంత మంది, విదేశాల నుంచి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో కూడా ఉండటంతో, సిబిఐ దూకుడు పెంచింది. ఏమి జరుగుతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read