వైసీపీ శివకుమార్ పెట్టిన పార్టీ. చేతులు మారి జగన్ కోసమే పుట్టిన పార్టీగా రూపాంతరం చెందింది. జగన్ కోసం, జగన్ చేతగా మారిపోయిన వైసీపీ పై కేంద్ర ఎన్నికల కమిషన్ నజర్ వేసిందని సమాచారం. వైసీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే వైసీపీ గుర్తింపు రద్దయ్యే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై హిందూస్తాన్ టైమ్స్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. నిబంధనలకి విరుద్ధంగా ఉన్న వైసీపీ పేరు, శాశ్వత అధ్యక్షుడి నియామకాన్ని సీఈసీ పరిశీలిస్తున్నట్టు కథనంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ పద్దతుల్ని వైసీపీ పాటిస్తోందా అనే అంశాన్ని సీఈసీ గమనిస్తోందని వివరించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ని ఎన్నకుని నాయకుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టడం అప్రజాస్వామ్యమంటోంది సీఈసీ. రాజకీయ పార్టీలు చేసే అప్రజాస్వామిక సవరణలను గుర్తించేది లేదని ఈసీ తేల్చి చెప్పినట్టు కథనంలో తెలిపారు. వాస్తవానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ అయిన వైసీపీని వైయస్సార్ కాంగ్రెస్‍గా పిలుస్తున్నారు. జగన్‍రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ప్లీనరీలో తీర్మానం చేసిన దానిపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికంటే ముందుగా వైసీపీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ నుంచి కూడా వివిధ సంఘాలు, నేతలు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదులు చేశారు.
వైసీపీ కి షాక్ ఇవ్వనున్న ఎన్నికల కమిషన్ ? ఇప్పటికే గ్రౌండ్ వర్క్ రెడీ...
Advertisements