ఎవరికైనా ఒక పార్టీకి, ఒక నేత ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలకు వారే సగం బలం. తమిళనాడులో కానీ, ఏపిలో కానీ. ముఖ్యంగా ఆ పార్టీ స్థాపించిన వ్యక్తులను ముందు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏపిలో మాత్రం వింత పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకడు అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజలే కాదు, యవత్తు దేశం, ఎన్టీఆర్ ముందు మోకరిల్లిన రోజులు కూడా ఉన్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవానికి, చిహ్నం అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకునే ప్రచారం చేస్తుంది. ఇక మరో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వైఎస్ ని ముఖ్యమంత్రిని చేసినా, ఆ పార్టీకి వెన్ను పోటు పొడిచి, బయటకు వచ్చి అదే వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టారు. సరి ఇది తప్పు లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ని వాడుకుని, రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, గత నాలుగు రోజులు నుంచి వైసిపీ అధిష్టానం తీరు చూసి, వైసీపీ శ్రేణులే షాక్ తిన్నాయి. ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది రాజకీయంగా చేస్తున్న ఎత్తుగడ అని అందరికీ తెలిసిందే. ఏదో ఒక రోజు చేసారు అంటే అర్ధం ఉంది, నాలుగు రోజుల నుంచి, పై స్థాయి నాయకుల నుంచి అందరు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూ, ఎన్టీఆర్ గొప్పతనం చెప్తూ, చేస్తున్న డబ్బా చూసి, ప్రత్యర్ధి పార్టీ ఆశయాలు మనం తీసుకుని వెళ్ళటం ఏంటి ? మన పార్టీ బ్రాండ్ వైఎస్ఆర్ బొమ్మ కాకుండా, ఎన్టీఆర్ బొమ్మతో ఈ హడావిడి ఏంటి, రాజకీయంగా ఇంత దిగజారాలా అంటూ, వైసీపీ శ్రేణులు బాధ పడుతున్నారు. మరి వారి అధిష్టానానికి ఇది అర్ధం అవుతుందో లేదో మరి.
వైఎస్ఆర్ ని మర్చిపోయిన వైసీపీ... కొత్త పేరు స్మరణతో, విస్మయం వ్యక్తం చేస్తున్న వైసీపీ క్యాడర్...
Advertisements