ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం పూర్తిగా పాల‌న గాలికొదిలేసింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మండువేస‌విలో అకాల‌వ‌ర్షాల‌తో రైతాంగం అత‌లాకుత‌ల‌మైపోయింది. ప‌రామ‌ర్శించేందుకు మ‌న‌సు రాని ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పంట‌లు నేల‌కొరిగి అన్న‌దాత‌లు ల‌బోదిబోమంటుంటే స‌ర్కారు ఆదుకుంటామ‌నే కంటితుడుపు ప్ర‌క‌ట‌న కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు. ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. చెప్పిన‌ట్టే రాష్ట్ర‌మంతా భారీ నుంచి అతి భారీవ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల ముప్పు ఉంద‌ని ప్ర‌జ‌ల్ని, రైతుల్ని హెచ్చ‌రించాల్సిన ప్ర‌భుత్వ యంత్రాంగం చేష్ట‌లుడిగి  చూస్తోంది. పంట‌లు పోయి రైత‌న్న‌లు ల‌బోదిబోమంటుంటే, ఏపీ మంత్రులు ర‌జ‌నీకాంత్‌ని తిట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వానికి హాజ‌రైన ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబు పాల‌నాద‌క్ష‌త‌ని ప్ర‌శంసించ‌డ‌మే ఆయ‌న చేసిన నేరం అన్న‌ట్టు వైసీపీలో మంత్రులు, స‌ల‌హాదారులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చిన బూతుల‌తో ర‌జ‌నీకాంత్‌ని తిడుతూ కాలం గ‌డుపుతున్నారు. ఇదే స‌మ‌యంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా అకాల వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ ప్రకటించినా ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌లేదు. భారీవ‌ర్షాల‌కు పంట‌లు పోయినా క‌నీసం ఎంత న‌ష్టం జ‌రిగిందో ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేయ‌ని ప్ర‌భుత్వం తీరుపై అన్న‌దాత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read