కింద నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఎప్పుడూ కేసులు, కోర్ట్ లు చుట్టూ తిరిగే వైసిపి పార్టీకి మరో గోల్డ్ మెడల్ వచ్చింది... గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, పై లైంగిక వేధింపులతో పాటు చీటింగ్ కేసు బుక్ అవ్వటంతో, పోలీసులు అరెస్ట్ చేశారు.... మంగళవారం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని, సాయంత్రం గుంటూరు 5వ అదనపు మున్సిఫ్ మేజిస్ర్టేట్ కోర్టు కి తీసుకువెళ్లగానే, ఆరోగ్యం బాగోలేదు అని చెప్పటంతో, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి... ఓ దళిత యువతికి అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50వేలు తీసుకుని.. లైంగికంగా వేధించిన కేసులో మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నాయకుడు టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కృష్ణారెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్ రెడ్డి, ఎల్.అప్పిరెడ్డి తదితరులు కోర్టు వద్దకు చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్సీగా ఉన్న కృష్ణారెడ్డిని మాచవరానికి చెందిన మాతా శోభ అనే మహిళ అంగన్‌వాడీ ఉద్యోగం కోసం ఆశ్రయించారు. ఇందుకుగాను కృష్ణారెడ్డి రూ.50 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఆమె ఎమ్మెల్సీ కార్యాలయం, ఇల్లు, అతిథి గృహానికి పలుమార్లు తిరిగింది. ఉద్యోగం ఇప్పించకపోగా ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 10న నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి సెక్షన్‌తోపాటు లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు.