వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత సహాయం చేశారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే కోట్ల రూపాయల ఆస్తులు ఏపీ తెలంగాణకి వదులుకుంది. దీంతోపాటు చాలా విషయాల్లో కేసీఆర్ ఆదేశించడం, జగన్ పాటించడం తెలుగు ప్రజలంతా చూస్తున్నారు. తాజాగా కేసీఆర్ తెరాసాని భారాసాగా మార్చారు. దీనికి సంబంధించిన సభని ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆహ్వానించారు. జగన్ రెడ్డినీ ఆహ్వానించినా, బీజేపీ భయంతో ఖమ్మం సభకు హాజరు కాలేదు. అటు బీజేపీతోనూ, ఇటు కేసీఆర్తోనూ స్నేహం కొనసాగిస్తూ అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు జగన్. ఖమ్మం సభకి తాను వెళ్లకపోయినా ఏపీ నుంచి బస్సులు, జనాలను జగనే అరేంజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను భారాస పేరుతో అద్దెకు తీసుకున్నారు. విజయవాడ జోన్ ఎన్టీఆర్ జిల్లాలో 105, ఏలూరు జిల్లాలో 45, విజయవాడ నుంచి మరో 70 బస్సులను ఖమ్మం సభకు కేటాయించారు. అలాగే జనాన్ని కూడా తరలించే బాధ్యతను వైసీపీ నేతలే చూశారని ప్రచారం సాగుతోంది. ఖమ్మంకి దగ్గరగా ఉండే జగ్గయ్యపేట, తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి భారీగా జనాన్ని తరలించారు. వందలాది బస్సులు ఖమ్మం సభకు వెళ్లిపోవడంతో ఏపీలో పండగ సెలవుల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గవర్నరు పేట, విద్యాదరపురం, ఇబ్రహీంపట్నం డిపోల బస్సులు ఖమ్మం వెళ్లడంతో విజయవాడ సిటీలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
జగన్ కేసీఆర్ క్విడ్ ప్రోకో ఒప్పందం.. అడ్డంగా దొరికారుగా
Advertisements