విశాఖ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజే 13 లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో చేసుకున్నామని సీఎం ప్రకటించారు. ఈ కంపెనీలలో చాలా వరకూ జగన్ రెడ్డి బినామీలు, ఆయన అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవాళ్లు, ఆయన బంధువులు, ఆయన పార్టీ వాళ్లే కావడం అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో టిడిపి సర్కారు ఉన్నప్పుడు ఎంవోయూ చేసుకున్న చలమలశెట్టి సునీల్ గ్రీన్ కో...ఇటీవల దావోస్ వెళ్లి టిడిపి హయాంలో చేసుకున్న ఒప్పందాలనే మళ్లీ చేసుకుంది. తాజాగా విశాఖలోనూ మరోసారి ఎంవోయూ చేసుకోవడం అనుమానాస్పద పెట్టుబడులు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు చేసుకున్నామని చెప్పారు. ఇది జగన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్న విజయసాయిరెడ్డి వియ్యంకుడు కంపెనీ అరబిందో గ్రూప్ రూ.10,365 కోట్లు పెట్టుబడి కట్టుకథేనని ప్రచారం సాగుతోంది. సీఎంకి చెందిన కంపెనీ అని పేరుపడిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు పెట్టుబడి అంటేనే జనం విరగబడి నవ్వుతున్నారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రకటించిన చాలా కంపెనీలు వారి బినామీలు, క్విడ్ ప్రోకో కేసులలో ఉన్నవారేనని స్పష్టం అవుతోంది. మరికొన్ని కంపెనీలు వైసీపీకి చెందినవారివని టాక్ వినిపిస్తోంది.
13 లక్షల కోట్ల కంపెనీల్లో జగన్ బినామీలే ఎక్కువా? ఆధారాలు బయట పెట్టిన టిడిపి...
Advertisements