వైసీపీలో రాష్ట్రమంతా అసంతృప్తి సెగలు కక్కుతున్నా నెల్లూరులోనే మొదట బయటపడింది. ఇది నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలను దూరం చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైసీపీ జాబితా నుంచి తీసేసింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మొదటి నుంచీ వైసీపీ దూరం పెట్టింది. ఈ తిరుగుబాటు తుఫాన్ ఇప్పుడు కర్నూలుని తాకింది. ఏకంగా టిడిపి నేతలే వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం సెన్సేషన్ అవుతోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి టిడిపిలో చేరాలని తహతహలాడుతున్నారని, మాజీ మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిల్చాయి. మరోవైపు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే బాబాయ్ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా టిడిపితో టచ్లో ఉన్నాడని వైసీపీ అనుమానిస్తోంది. గతంలో టిడిపిలో ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో శిల్పా వాళ్లకు సత్సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. వైసీపీ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. శిల్పా వాళ్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయేమో కానీ వైసీపీ అనుమానపు చూపులు ఎక్కువయ్యాయి. శ్రీశైలం సీటు కోసం బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వైసీపీ రెడీ చేసుకుంటోందని ప్రచారం సాగుతోంది.
వైసీపీ తుఫాన్ నెల్లూరు వద్ద తీరం దాటి కర్నూలుని తాకింది
Advertisements