అవినీతి పై పోరాడతా, నేను వస్తే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది అంటూ, నిన్న కడపలో పాదయాత్ర చేసిన జగన్, అలా కర్నూల్ లో అడుగుపెట్టాడో లేదో, ఇవాళ అదే కడపలో, వైసీపీ నేత రెచ్చిపోయాడు... కడప జిల్లాలోని వీఎన్ పల్లె మండలం వీరపల్లె దగ్గర టీడీపీ నేత భాస్కర్‌రెడ్డిపై, వైసీపీ నేత శ్రీనివాసుల రెడ్డి కాల్పులు జరిపారు. పొలం దగ్గర ఒకరికొకరు ఎదురుపడటంతో వైసీపీ నేత కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు రౌండ్లు కాల్పులు జరిగేసరికి, అప్రమత్తమైన భాస్కర్‌రెడ్డి పక్కన ఉన్న తోటలోకి పరుగులు తీశారు.
దీంతో భాస్కర్‌రెడ్డికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర గాయాలపాలైన భాస్కర్‌రెడ్డి ఆయన్ను అత్యవసర చికిత్స కోసం కడప జిల్లా ప్రొద్దటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సకాలంలో భాస్కర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో టీడీపీ నేతపై శ్రీనివాసులరెడ్డి స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది... ఇద్దరూ మండల స్థాయి నేతలు కావటంతో, రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి...
ఇది వరకు, చిన్నపాటి ఘర్షణ జరగడంతో వైసీపీ నేత ఎప్పటి నుంచో చంపటానికి చూస్తున్నారు... గురువారం నాడు పొలం దగ్గర టిడిపి నేత ఎదురుపడటంతో, వైసీపీ నేత తన దగ్గర ఉన్న తుపాకి తీసుకుంది కాల్పులు జరిపారు. కాగా ఇటీవల కడప జిల్లాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఫ్యాక్షన్‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్న కడపలో ఇలా వరుస కాల్పులు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి.