ఒక పక్క 40 మంది గల్లంతు అయ్యారు అనే వార్తా... 12 మంది ప్రాణాలు కోల్పోయారు... ఇంకా ఎంత మంది గల్లంతు అయ్యారో తెలీదు... 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది... సహాయ కార్యక్రమాల్లో రెస్క్యూ టీం , ఎన్‌డిఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ బృందాలు పాల్గుంటున్నాయి... ఇంత గందరగోళంలో ఎవడన్నా రాజకీయాలు చేస్తారా ? సహాయ కార్యక్రమాలకి అడ్డుపడతారా ? వైసీపీ నాయకులు, పార్ధసారధి, జోగి రమేష్, ఉదయభాను చేసింది ఏంటి ? చేతనైతే సహాయం చెయ్యాలి.. ఆ బృందాలతో కలిసి, సహాయ కార్యక్రమాల్లో పాల్గునాలి... అంతే కాని, సియం డౌన్ డౌన్ అనే నినాదాలు చేసే టైమా అది ?
ఆ బోటు ఎవరిది ? పర్మిషన్ చూపించండి... టిడిపి నాయకుల బినామీలు ఈ బోటు నడుపుతున్నారు అంటూ పోలీసులు మీద ఎగబడి, దౌర్జన్యం చేస్తే ఎలా ? మీరు రెస్క్యూ ఆపరేషన్ ఆపేసి, మాకు సమాధనం చెప్పండి, మేము మా జగన్ కు బ్రీఫ్ చెయ్యాలి అనే రాజకీయం ఆ టైం లో అవసరమా ? అక్కడ అంబులెన్స్ కంటే ముందే మేము వచ్చాము అంటున్నారు, మరి మీరు మీ కార్లలో ఎందుకు హాస్పిటల్ కు తీసుకువెళ్ల లేదు ? మీకు బాధ్యత లేదా ? పోలీస్ కమీషనర్ కూడా మిమ్మల్ని బయటకు వెళ్లి రాజకీయాలు చేసుకోమన్నారు అంటే, మీరు అలాంటి చోట, ఎలాంటి పని చేసారో ఒక్కసారి ఆలోచించుకోండి...
నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని నిందించాలి... ఇక్కడే కాదు, సహజ మరణం కాకుండా, ఎలా మరణించినా దానికి ప్రభుత్వానిదే బాధ్యత... కాని మన విమర్శకు సందర్భం లేదా ? వీలైతే మీకు తోచిన సాయం చేయాలి... అంతే కాని, మీ సాక్షి టీవీ న్యూస్ కోసం, అక్కడకు వచ్చి ఆందోళన చేసే సమయమా అది ? ఒక పక్క టీవీల్లో చూసే వారు, గల్లంతైన వారు బ్రతికితే బాగుండు అంటూ దండాలు పెట్టుకునుంటే, మీ దరిద్రపు రాజకీయం చూసి, మీ మీద ఊస్తున్నారు... కొంచెం రెస్క్యు ఆపరేషన్ ఆపరేషన్ అయ్యేదాకా మీ రాజకీయం ఆపండి... రేపు కచ్చితంగా అందరం ప్రభుత్వాన్ని నింద్దిదాం... ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, మన సలహాలు ఇద్దాం....