విభజన చట్టం ప్రకారం ఏపీకి న్యాయంగా రావాల్సినవేవీ ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. రాజ్యసభ, లోక్ సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పూర్తి అవ్వదని చెప్పేసింది కేంద్రం. ప్రత్యేక హోదా ఇవ్వం అని కూడా స్పష్టం చేసింది. ఒకే రోజు పార్లమెంటులో ఏపీ ప్రయోజనాలు నెరవేర్చలేమని బీజేపీ సర్కారు తేల్చేసినా పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా వున్న వైసీపీ నోరు ఎత్తలేదు. రాజ్యసభ, లోక్ సభలో కనీసం తమ నిరసన తెలపడానికి కూడా వైసీపీ ఎంపీలు ప్రయత్నించలేదు. వైసీపీ అధినేతపై సీబీఐ ఈడీ కేసులు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న ఇరుక్కోవడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వైసీపీ ఎంపీని అనుమానిస్తుండడం వంటి కేసుల వల్లే ఏపీకి ఎంత నష్టం చేసినా వైసీపీ ఎంపీలు మౌనం వహిస్తున్నారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisements