ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, వైసిపి పార్టిలోని నేతల మధ్య రోజు రోజుకి వివాదాలు బయట పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వైశ్య సామాజిక వర్గం నేత సుబ్బారావు గుప్తాపై దా-డి-తో, ఇప్పుడు దిద్దలూరులో కూడా లుకలుకలు బయట పడ్డాయి. వైసీపీ మీటింగ్లో సుబ్బారావు గుప్తా చేసిన సంచలన వాఖ్యలే ఈ వివాదానికి కారణంగా మారాయి. కొడాలి నాని, వల్లభనేని వంశి, అంబటి, ద్వారంపూడి వాడే బాష పైన, సుబ్బారావు గుప్తా ఘాటుగా విమర్శించారు. వారి భాష వల్ల పార్టీ ఓటు బ్యాంక్ పోతుందని, ఇలాంటి వారిని అదుపులో పెట్టాలని అన్నారు. రేపు టిడిపి అధికారంలోకే వస్తే, రోడ్డుల మీద గుడ్డలు ఊడదీసి కొట్టే పర్తిస్థితి ఉందని అన్నారు. అయితే అ తరువాత రోజే, వైసీపీ మార్క్ రాజకీయం చూపించిన సంగతి తెలిసిందే. గుప్తా ఇంటి పైకి వెళ్లి దా-డి చేసారు. తరువాత సుబ్బారావు గుప్తా పారిపొయినా, ట్రేస్ చేసి మరీ వెంటాడారు. బాలినేని అనుచరుడు, సుభానీ రెచ్చి పోయాడు. అంతే కాక, మా జోలికి వస్తే ఇలా ఉంటుందని వీడియో కూడా బయటకు విడుదల చేసారు. ఈ దెబ్బతో, వైశ్య సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనలను పిలుపు ఇచ్చారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తాని కొట్టడమే కాకుండా తల్లిని కుటుంబసభ్యులను తిట్టడం పై, ఆర్యవైశ్య నేతలు మానసిక వేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది.

anna 271220212

అయితే వైశ్య సామాజిక వర్గం ఆగ్రహంతో, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇరుకున పడ్డారు. ఆ ఇంపాక్ట్ తమ మీద పడకుండా, ముందు జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం పై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఇలా దా-డి చేయటం హేయం అని అన్నారు. ఒక రెడ్డినో, ఒక కమ్మనో, వేరే సామాజిక వర్గాన్నో ఇలా ట్రీట్ చేస్తారా అని ప్రశ్నించారు. త్వరలోనే తానూ జగన్ కలిసి సంచలన నిర్ణయం చెబుతానని, తానూ చాల రోజులుగా జగన్ కలవాలని అనుకుంటున్నానని ,కాని జగన్ అపాయింట్‌మెంటు దొరకడంలేదని రాంబాబు చెప్పారు. దీనితో ఈ అంశం గిద్దలూరులో చర్చ నీయంసంగా మారింది. మరోవైపు స్థానికంగా వైసీపీలో రెడ్డి సామాజికవర్గం అంతా ఒక్కట్టిగా పనిచేస్తున్నాయి. ఈ సారి ఏదేమైనా రాంబాబుకు టిక్కెట్ రాకుండా చేయడానికి రెడ్డి సామాజికవర్గంవ గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ జగన్ తో కలిసి చెప్పటానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఎమ్మెల్యేలను కలవడానికి నిరాకరిస్తున్నారని కూడా సమాచారం. ఈ సారి మంత్రులందని మారిస్తే వెల్లంపల్లి స్థానంలో ఆర్యవైశ్య కోటాలో అన్నా రాంబాబు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. మరి జగన్ కలిస్తే రాంబాబు ఏం సంచలన నిర్ణయం ప్రకటిస్తాడో చూడాలి. మొత్తంగా చూస్తే అసంతృప్తి నేతలు వైసీపీలో ఎక్కువవుతున్నట్లు అర్థమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read